The Goat Life 7 days Collections చరిత్ర సృష్టించిన ది గోట్ లైఫ్ మూవీ.. 100 కోట్లపై కన్నేసిన సుకుమారన్!

మలయాళంలో బెస్ట్ సెల్లర్‌గా మారిన పుస్తకం ఆడు జీవితం ఆధారంగా తెరకెక్కిన ది గోట్ లైఫ్ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. గల్ఫ్ దేశాలకు వలస పోయిన మలయాల వ్యక్తి అక్కడ ఎలాంటి కష్టాలకు గురయ్యాడు అనే పాయింట్‌తో ఈ సినిమా ఎమోషనల్ జర్నీగా తెరకెక్కింది. నజీబ్ అనే బాధితుడి పాత్రను సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించారు. బ్లెస్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సాధిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) చిత్రం జోర్డాన్, ఇతర దేశాల్లో ఎడారి ప్రాంతంలో చిత్రీకరించారు. అత్యంత ప్రతీకూల పరిస్థితుల్లో రూపొందిన ఈ సినిమా సుమారుగా 13 ఏళ్లపాటు షూట్ చేశారు. దాంతో ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. పాత్రలు చాలా తక్కువైనప్పటీకి క్వాలిటీ పరంగా హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా రూపొందించడంతో సుమారుగా 80 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది.

The Goat Life Aadujeevitham Day 7 Box Office Collections Worldwide

మలయాళంలో గోట్ ఆఫ్ లైఫ్ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు 6.5 కోట్లు, రెండో రోజు 5.25 కోట్లు, మూడో రోజు 6.75 కోట్లు, నాలుగో రోజు 7.6 కోట్లు, 5వ రోజు 4.8 కోట్లు, 6వ రోజు 3.82 కోట్లు, 7వ రోజు 3.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మలయాళంలోనే 44 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

ఇండియాలో ది గోట్ లైఫ్ మూవీ తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా మలయాళంలో 6 కోట్లకుపైగా వసూళ్లను సాధించగా.. కర్ణాటకలో 1.5 కోట్లు, తమిళనాడులో 1 కోటి రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్‌లో 50 లక్షలు, మిగితా ప్రాంతాల్లో 50 లక్షలు వసూలు చేసింది. ఈ మూవీ రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద జర్నీని మొదలుపెట్టింది.

తొలి రోజు తర్వాత నిలకడగా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటింది. ఈ మూవీ రెండో రోజు 14 కోట్లు, మూడో రోజు 20 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 15 కోట్ల రూపాయలు, ఐదో రోజు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆరో రోజు 8 కోట్ల రూపాయలు, ఏడో రోజు 6 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసింది.

The Goat Life Aadujeevitham Day 7 Box Office Collections Worldwide

ది గోట్ లైఫ్ మూవీకి ఉత్తర అమెరికాలో బ్రహ్మండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు 120K, 2వ రోజు 175K, 3వ రోజు 190K, 4వ రోజు 190K, 5వ రోజు 85 వేల డాలర్లు, ఆరో రోజు 71 వేల డాలర్లు, 7వ రోజు 50 వేల డాలర్లు వసూలు చేసింది. దాంతో అమెరికాలో 800K డాలర్లు అంటే 7 కోట్ల రూపాయల మేర వసూలు చేసింది. ఇతర దేశాలతో కలుపుకొని ఈ చిత్రం 31 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ లూసిఫర్, ప్రేమమ్, మంజుమీల్ బాయ్స్ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన ఆరో చిత్రంగా రికార్డు సృష్టించింది.

గోట్ ఆఫ్ లైఫ్ చిత్రం ఓవర్సీస్‌లో 31 కోట్ల రూపాయలు, ఇండియాలో 45 కోట్ల నికరంగా, 51 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 82 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రానున్న రోజుల్లో 100 కోట్ల మార్కు చేరేందుకు రెడీ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X