The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

యాక్టర్, డైరెక్టర్, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ది గోట్ లైఫ్ (ఆడుజీవితం). మలయాళంలో ప్రముఖ దర్వకుడు బ్లెస్సీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో అమలాపాల్, జిమ్మి జీన్ లూయిస్, శోభా మోహన్, కేఆర్ గోకుల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ నిర్మించారు. మార్చి 28వ తేదీన రిలీజైన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) మూవీ విషయానికి వస్తే.. పాపులర్ రైటర్ జెంజమిన్ రచించిన ఆడుజీవితం పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. కేరళకు చెందిన నజీబ్ మహ్మద్ బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి ఎలాంటి నరకయాతన చూశాడనేది ఈ సినిమా కథ. ఈ చిత్రాన్ని 2008లో మొదలుపెట్టారు. ఈ సినిమా రిలీజ్ కావడానికి అనేక ప్రసవ నొప్పులను అనుభవించింది. ఈ మూవీ విడుదల కావడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది.

The Goat Life Aadujeevitham Expected Box Office Collections Worldwide

ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) మూవీని పలుదేశాల్లో చిత్రీకరించారు. కథ డిమాండ్ చేయడంతో జోర్డాన్‌లోని ఎడారుల్లో భారీగా చిత్రీకరించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, ఏఆర్ రెహ్మాన్ తదితరులు, ఇతర సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 80 కోట్ల రూపాయలు అయిందని ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా నిర్వహించడం వల్ల దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ యావరేజ్ పర్వాలేదనిపించింది. అయితే మలయాళంలో మినహాయిస్తే.. మిగితా భాషల్లో పెద్దగా రియాక్షన్ కనిపించలేదు. మలయాళంలో 65 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదైంది. కొచ్చి, త్రివేండ్రం, కోజికోడ్, కొల్లాం, కొట్టాయం ప్రాంతాల్లో 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీ కనిపించింది. తమిళం, కన్నడ, తెలుగులో 20 శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ నమోదైంది.

The Goat Life Aadujeevitham Expected Box Office Collections Worldwide

ఇక ది గోట్ ఆఫ్ లైఫ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. ఇక కేరళలో మరో మూడు కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మేర తొలి రోజు కలెక్షన్లు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో కింగ్ ఆఫ్ కోతా చిత్రం 16 కోట్ల మేర తొలి రోజు కలెక్షన్లు రాబట్టింది.

ఆడుజీవితం సినిమా లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాల్సిందే. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా సుమారుగా 60 కోట్ల రూపాయల వాల్యూ కట్టారు. ఆ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తే తప్పా ఈ మూవీ ప్రాఫిట్స్‌లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X