The GOAT Overseas Collections: బాక్సాఫీస్ వద్ద ది గోట్ మాస్ కలెక్షన్ల జాతర.. కల్కి రికార్డులకు ప్రమాద హెచ్చరిక
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ సినిమా తమిళ, హిందీ, కన్నడ భాషలతోపాటు ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లను రాబడుతున్నది. విజయ్ కెరీర్‌లో గతంలో లేని విధంగా ఈ సినిమా రికార్డు వసూళ్లు కలెక్ట్ చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈ సినిమా గత 4 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్‌లో వసూలు చేస్తున్న బాక్సాఫీస్ వసూళ్లు వివరాల్లోకి వెళితే..
ది గోట్ మూవీ విదేశీ మార్కెట్‌లో అనూహ్యమైన కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా ఫ్రాన్స్‌లో 30 వేల టికెట్లు అమ్ముడు పోవడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. ఇప్పటి వరకు ఈ రేంజ్‌లో తమిళ సినిమాకు ఫుట్‌ఫాల్స్ రావడం ఇదే మొదటిసారి అని పేర్కొంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఈ సినిమాకు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. న్యూజిలాండ్‌లో ఈ చిత్రం 1 లక్ష న్యూజిలాడ్ డాలర్లు రాబట్టింది.

ఇక సింగపూర్‌లో ది గోట్ మూవీ కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 1.5 మిలియన్ సింగపూర్ డాలర్లను వసూలు చేసింది. మలేషియాలో ఈ సినిమా 7.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అలాగే ఈ యూరోపియన్ యూనియన్ దేశాల్లో, శ్రీలంకలో కూడా భారీ కలెక్షన్లు సాధించింది.
ఇక యూకే, ఐర్లాండ్ దేశాల్లో ఈ మూవీ 1 మిలియన్ పౌండ్స్‌కు చేరువైంది. ఈ సినిమా అమెరికాలో 2 మిలియన్లు, కెనడాలో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో నార్త్ అమెరికాలో సుమారుగా 3 మిలియన్లు రాబట్టింది. ఇక గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా 3 మిలియన్ డాలర్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కరెన్సీలో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో 18 కోట్ల రూపాయలు, కెనడాలో 8 కోట్ల రూపాయలు, యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాల్లో 24 కోట్ల రూపాయలు, యూకే, ఐర్లాండ్ దేశాల్లో 8 కోట్ల రూపాయలు, ఆస్ట్రేలియాలో 5 కోట్ల రూపాయలు, న్యూజిలాండ్‌లో 54 కోట్ల రూపాయలు, సింగపూర్‌లో 8 కోట్ల రూపాయలు, మలేషియాలో 14 కోట్ల రూపాయలు, యూరోపియన్ యూనియన్ ఇతర దేశాల్లో 15 కోటల్ రూపాయలు వసూల చేసింది.
నార్త్ అమెరికా, ఓవర్సీస్‌లో గత నాలుగు రోజుల్లో విజయ్ చిత్రం 15 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 120 కోట్ల రూపాయలు విదేశాల్లోనే సంపాదించి పెట్టింది. ఈ సినిమా కలెక్షన్ల జోరు ఇలానే కొనసాగితే.. ఈ చిత్రం కల్కి వసూలు చేసిన ఆల్ టైమ్ ఓవర్సీస్ రికార్డును త్వరలోనే అధిగమించే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











