Great Pre Wedding Show Box Office: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బాక్సాఫీస్ జోరు.. ఓవర్సీస్‌లో భారీ కలెకన్లు
తెలుగు సినిమా రంగంలో టాలెంటెండ్ యాక్టర్ తిరువీర్ ప్రధాన పాత్రలో టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా తదితరులు నటించిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచమైన ఈ చిత్రానికి సందీప్ అగరం నిర్మాతగా, కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ చిత్రం రిలీజైన తర్వాత తొలి ఆట నుంచే మంచి రెస్పాన్స్ అందుకొంటూ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల్లో పెద్దగా కలెక్షన్లు రాబడుతున్నది.
కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం, సోమశేఖర్ సినిమాటోగ్రఫి, నరేష్ అడుప ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.నవంబర్ 7వ తేదీన రిలీజైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లి వెళితే..

పెళ్లి చూపులు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంశాలుగా రూపొందిన ఈ చిత్రంలో అంతా కొత్తవారే అయినప్పటికీ ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమాలో తమ పాత్రలను పోషించారు. అలాగే టాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. ఈ సినిమాను మొత్తంగా అన్ని ఖర్చులు కలిపి సుమారుగా 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల థియేట్రికల్ వాల్యూగా అంచనా వేశారు. సుమారుగా రెండు కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.
గత రెండు వారాలుగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతున్నది. ఈ చిత్రం తొలివారం సుమారుగా 1 కోటి రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం రెండో వారంలో కూడా సమారుగా 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం గత 14 రోజుల్లో 1.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులోనే ఈ సినిమా సాధించిన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా ఆంధ్రా, నైజాంలోనే కాకుండా నార్త్ అమెరికాలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం అమెరికా, కెనడా రాష్ట్రాల్లో తనదైన శైలిలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం తాజా గణాంకాల ప్రకారం.. 100,777 అమెరికన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 1 కోటి రూపాయలు వసూలు చేసింది అని అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకొన్నది. ఈ సినిమా రైట్స్‌ను జీ సంస్థ సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











