The GOAT Advance Booking: రిలీజ్‌కు ముందే విజయ్ మూవీకి రికార్డు కలెక్షన్లు..వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ రచ్చ

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన సైన్స్, ఫిక్షన్, యాక్షన్ డ్రామా ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAt). ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మించారు. ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, లైలా, స్నేహ, మీనాక్షి చౌదరీ, వైభవ్, యోగిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. గత నాలుగు రోజుల క్రితం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

విజయ్ దిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అగ్రశ్రేణి నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాకు భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఉపయోగించారు. దాంతో ఈ సినిమాకు భారీగా నిర్మాణ వ్యయం కేటాయించారు. ఓవరాల్‌గా ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయలతో నిర్మించారు.

The Greatest of All Time Advance Booking Worldwide Vijay Movie advance booking rampage Worldwide

తమిళంలో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఆగస్టు 31వ తేదీన ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్ది గంట్లోనే 50 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. తమిళంలో రికార్డు దిశగా ఈ సినిమా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కేరళలో అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభించింది.

ఇక కన్నడలో ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లభించడమే కాకుండా హాట్ కేకుల్లా టికెట్లు అమ్మకాలు జరిగాయి. ఇప్పటి వరకు కన్నడలో 2 కోట్ల రూపాయల కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వసూలు చేసింది. ఇంకా 5 రోజులు ఉన్నందున్న కర్ణాటక బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

ఇక అమెరికా, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియాలో కూడా భారీగా ఓపెనింగ్స్‌ నమోదు అవుతున్నాయి. అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా 750K డాలర్లు వసూలు చేసింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అడ్వాన్స్ బుకింగ్‌కు వస్తున్న స్పందన చూసి ..ఇక ఈ సినిమా తొలి రోజు 75 నుంచి 85 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే.. ఇంకా ఈ రేంజ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X