The GOAT Collections: గోట్ మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. విజయ్ కెరీర్‌లో సంచలనం.. ఎన్ని కోట్ల కలెక్షన్లంట్లే?

తమిళ సూపర్ స్టార్ విజయ్, ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరీ తదితరులు నటించిన చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన రిలీజై మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ మూవీకి ఊహించని విధంగా అడ్వాన్స్ బుకింగ్ కావడంతో రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు అవుతాయని భావించారు. కానీ ఈ మూవీ కలెక్షన్లు భారీగానే ఉన్నప్పటికీ.. షాకింగ్‌గా ఉన్నాయి. ఆ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని భారీ తారాగాణంతో నిర్మించారు. ఇండస్ట్రీలోని టాప్ టెక్నిషియన్స్ పనిచేయడంతో ఈ సినిమాకు భారీగా నిర్మాణ వ్యయం అయింది. దాంతో ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయలతో నిర్మించారు.

The Greatest of All Time Collections Worldwide Vijay Movie Crossed 100 Crores at Box Office

ది గోట్ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు బిజినెస్ జరిగింది. ఈ సినిమా తమిళనాడు హక్కులు 75 కోట్లకుపైగా, ఆంధ్రా, నైజాం హక్కులు 21 కోట్లు, కర్ణాటక హక్కులు 11 కోట్ల రూపాయలు, కేరళ హక్కులు 15 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ హక్కులు 55 కోట్ల రూపాయలు మేర జరిగాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ హక్కులు సుమారుగా 185 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

విజయ్ కెరీర్‌లో చివరి సినిమా అనే ఊహాగానాలు ప్రచారం కావడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ కనిపించింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6500 స్క్రీన్లలో రిలీజ్ చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో 250 కు పైగా స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. దాంతో తొలి రోజు రికార్డు వసూళ్లు నమోదు అయ్యాయి.

ఇక ఇండియాలో ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. తమిళంలో 40 కోట్లకుపైగా నికర వసూళ్లు, తెలుగులో 3 కోట్ల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయలు, కన్నడలో 3 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల కలెక్షన్లు నమోదు అయ్యాయి. దాంతో ఈ సినిమా ఫస్ట్ డే 50 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది.

The Greatest of All Time Collections Worldwide Vijay Movie Crossed 100 Crores at Box Office

ఇక ఓవర్సీస్‌లో ది గోట్ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి నార్త్, అమెరికా, యూకే, ఇతర దేశాల్లో బ్రహ్మండమైన ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం అన్నీ దేశాలతో పాటుగా 5 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్లు నమోదు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 50 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.

ది గోట్ సినిమాకు ఇండియాలో 70 కోట్ల రూపాయలు, అలాగే ఓవర్సీస్‌లో 50 కోట్లకుపైగా కలెక్షన్లు నమోదు చేసింది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల రూాపాయలు వసూలు చేసింది.

విజయ్ నటించిన ఈ మూవీ రెండో రోజు కూడా భారీ వసూళ్లు నమోదు చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2వ రోజు 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 176 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

అయితే గత చిత్రం లియో కంటే తక్కువగా వసూళ్లు రాబట్టడంతో అభిమానులు షాక్‌లో ఉండిపోయారు. లియో చిత్రం తొలి రోజున 145 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేయడం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 190 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X