The GOAT Collections: కలెక్షన్ల వేట మొదలెట్టిన విజయ్ .. ది గోట్ మూవీకి ఎన్ని కోట్లంటే?

వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్) సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్సన్‌, కొడుకు సెంటిమెంట్ మిక్స్ చేసిన ది గోట్‌ భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ఆధారంగా గోట్ కలెక్షన్స్‌పై అంచనాను ఒకసారి పరిశీలిస్తే.

దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో ది గోట్ తెరకెక్కింది. ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, మోహన్, జయరాం, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో ది గోట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా విజయ్ సినిమా రిలీజ్ అంటే తమిళనాట పండుగ వాతావరణం నెలకొంటుంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా రిలీజైన థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అభిమానులు ప్రీమియర్స్ కోసం బుధవారం అర్ధరాత్రి నుంచే థియేటర్లకు క్యూకట్టారు.

The Goat ilaya thalapathy vijay joseph s the greatest of all time Day 1 expected Collections here s the details

ప్రీమియర్స్ నుంచే ది గోట్‌కు పాజిటివ్ రివ్యూలు వస్తుండటంతో బుకింగ్స్ పెరుగుతున్నాయి. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. రీసెంట్‌గా తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించిన విజయ్.. 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఇళయ దళపతి పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆయనకు ఇదే చివరి చిత్రమనే ప్రచారం జరుగుతోంది. దీంతో గోట్ రిజల్ట్ ఎలా ఉన్నా సరే సినిమాకు ప్రేక్షకులు పోటెత్తుతారని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గోట్ తొలి రోజు ఎలాంటి ఓపెనింగ్స్ రాబడుతుందో చూస్తే .

తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్స్ విషయానికి వస్తే విజయ్ చివరి సినిమా లియోతో పోలిస్తే .. తొలిరోజు ఈ సినిమాకు మంచి బుకింగ్స్ నమోదవుతున్నాయి. తెలుగునాట ది గోట్ ఫస్ట్ డే రూ.7 నుంచి రూ.8 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ విజయ్ మూవీకి మంచి బుకింగ్స్ అవుతున్నాయట. ఇప్పటి వరకు రిలీజైన తమిళ చిత్రాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన చిత్రంగా గోట్ నిలిచే అవకాశాలున్నాయట.

The Goat ilaya thalapathy vijay joseph s the greatest of all time Day 1 expected Collections here s the details

తమిళులు ఎక్కువగా ఉండే సింగపూర్‌లో ఓపెనింగ్ డే నాడు గోట్ 400K సింగపూర్ డాలర్ల గ్రాస్‌ను రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. లియో, సర్కార్‌ల తర్వాత సింగపూర్‌లో థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డును ది గోట్ సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో కోలీవుడ్ ప్రీమియర్స్‌లో మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాలలో కబాలి టాప్‌లో ఉండగా, పోన్నియన్ సెల్వన్ 1, జైలర్, లియో, ది గోట్ నిలిచాయి.

కడపటి వార్తలు అందేసరికి ప్రీ సేల్స్ ద్వారా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌కు తొలిరోజు ఇండియా వైడ్‌గా రూ.37 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.32 కోట్లు.. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ.70 కోట్ల ఓపెనింగ్స్‌ను రాబడుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వీకెండ్‌కి ముందేరూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని చెబుతున్నారు. మరి కలెక్షన్స్ పరంగా ది గోట్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X