The GOAT Box Office: దుమ్మురేపిన ది గోట్ కలెక్షన్లు.. రజనీపై విజయ్ రికార్డు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?

ఇళయ దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ (The Ghost) చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా తమిళనాడు, ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు సాధిస్తున్నది. ముఖ్యంగా ఈ సినిమాకు విదేశీ మార్కెట్‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేయగా.. నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. ఈ సినిమా 10 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తమిళనాడులో ది గోట్ చిత్రం రెండో శనివారం భారీగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద రఫ్ ఆడిస్తున్నది. ఈ మూవీ ఇండియన్ 2 ఓపెనింగ్ డే రోజున వసూలు చేసిన గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండో వారంలో స్ట్రాంగ్2గా కనిపించింది.

The Greatest of All Time Day 10 Collections Worldwide Vijay Movie inching toward 400 crores

ది గోట్ సినిమా 10వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి తమిళ రాష్ట్రంలోని దిండిగల్ 82 శాతం, త్రిచీ 80 శాతం, చెన్నైలో 70 శాతం, కోయంబత్తూరు, పాండిచ్చేరి, మధురై 50 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. మిగితా ప్రాంతాల్లో 35 నుంచి 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

రెండో వారాలకు సంబంధించి ఈ చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలివారం 178 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళనాడులో 157 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో వారంలో శుక్రవారం 7 కోట్ల రూపాయలు, 10వ రోజు 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 177 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక అమెరికాలో ది గోట్ చిత్రం కొత్తగా రిలీజైన సినిమాల కంటే అధికంగా వసూలు చేసింది. ఈ సినిమా 184 లోకేషన్లలో 100000 డాలర్లకుపైగా అంటే 85 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా నార్త్ అమెరికాలో అరుదైన నాలుగు మిలియన్ డాలర్ల వసూలు సాధించింది. అంటే ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 34 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

ఇక ప్రంపచవ్యాప్తంగా ది గోట్ చిత్రం భారీగా వసూళ్లు సాధించింది. ఇండియాలో 14 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 370 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అమెరికా, కెనడాలో 34 కోట్లతో కలిపి ఓవర్సీస్‌లో మొత్తంగా 140 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా త్వరలోనే 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X