The GOAT Day 11 Collections: బాక్సాఫీస్‌ను రికార్డు వసూళ్లతో కుమ్మేసిన విజయ్..ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ (The GOAT) చిత్రం కలెక్షన్ల ప్రవాహాన్ని వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కొనసాగిస్తున్నది. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడంతో భారీ వసూళ్లు రాబట్టింది. గత 11 రోజుల్లో ఈ సినిమా ఎన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలే అనే వివరాల్లోకి వెళితే..

విజయ్‌తోపాటు స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది. ఈ మూవీని నిర్మాతలు కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ వరల్డ్ వైడ్‌గా 6000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా భారీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

The Greatest of All Time Day 11 Collections Worldwide Vijay Movie racing toward 400 crores

మిక్స్ డ్ టాక్‌తో ది గోట్ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం తొలివారం తమిళంలో 157 కోట్ల రూపాయలు, తెలుగులో 12 కోట్లు, కన్నడలో 25 కోట్లు, కేరళో 12 కోట్లు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 17 కోట్లు వసూలు చేసింది. తొలివారం ఈ సినిమా ఇండియాలో 224 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక రెండో వారంలో ది గోట్ చిత్రం నిలకడగా వసూళ్లను సాధించింది. తమిళంలో ఈ చిత్రం 9వ రోజు 7 కోట్ల రూపాయలు, 10వ రోజు 13 కోట్ల రూపాయలు, 11వ రోజు 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండో వారంలో 25 కోట్ల రూపాయలు ఇండియాలో రాబట్టింది. దాంతో ఈ సినిమా 250 కోట్లకుపైగా రూపాయలు ఇండియాలోనే వసూలు చేసింది.

11వ రోజున ది గోట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. తమిళం, ఇతర భాషల్లో 15 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో 5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. రెండో వారాంతంలో ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

The Greatest of All Time Day 11 Collections Worldwide Vijay Movie racing toward 400 crores

ఓవర్సీస్‌లో విజయ్ నటించిన ది గోట్ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనాన్ని కొనసాగించింది. నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికాలో కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఈ చిత్రం 4.5 మిలియన్ డాలర్లు అంటే 38 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో ఈ చిత్రం 1.2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టింది. మిగితా దేశాల్లో కలిపి ఈ చిత్రం సుమారుగా 18 మిలియన్ డాలర్లు అంటే.. 151 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ది గోట్ చిత్రం థియేట్రికల్ రైట్స్‌కు భారీ ధరకు అమ్ముడుపోయాయి. కానీ ఆంధ్రా, నైజాం, కేరళలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోవడంతో భారీ నష్టాలను మిగిల్చింది. తమిళం, ఓవర్సీస్, కన్నడలో ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేయడంతో ఈ చిత్రం 400 కోట్ల మైలురాయిని దాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X