The GOAT Day 12 Collections: విజయ్ కెరీర్‌లో మరో సంచలనం.. ది గోట్ మరో రికార్డు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తమిళ సూపర్ స్టార్ విజయ్, ప్రభుదేవా, స్నేహా, మీనాక్షి చౌదరీ, ప్రశాంత్, అజ్మల్, లైలా లాంటి స్టార్ యాక్టర్లు నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు రాబడుతున్నది. అయితే డిజాస్టర్ టాక్ తర్వాత కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టడం విజయ్ స్టార్ స్టామినాకు సాక్ష్యం అంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఈ సినిమా గత 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది. ఈ మూవీని నిర్మాతలు కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ వరల్డ్ వైడ్‌గా 6000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమా భారీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో అంటే 190 కోట్ల రూపాయల షేర్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

ది గోట్ సినిమాకు తమిళం, ఓవర్సీస్‌లో మంచి ఆదరణ లభిస్తున్నది. నార్త్ అమెరికాలోనే ఈ మూవీకి రికార్డు వసూళ్లు నమోదు అయ్యాయి. అమెరికా, కెనడాలో కలిపి 14 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారుగా 18 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 150 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది.
ది గోట్ చిత్రం తొలివారం తమిళంలో 195 కోట్ల రూపాయలు, తెలుగులో 12 కోట్లు, కన్నడలో 26 కోట్లు, కేరళలో 12 కోట్లు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 17 కోట్లు వసూలు చేసింది. తొలివారం ఈ సినిమా ఇండియాలో 224 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇదిలా ఉండగా, 12వ రోజు.. రిలీజ్ తర్వాత రెండో సోమవారం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. ఈ చిత్రం తమిళంలో 5.5 కోట్ల రూపాయలు, హిందీలో 50 లక్షలు, తెలుగులో 8 లక్షల వసూళ్లు సాధించింది. కన్నడలో 40 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 6.5 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 8.5 నుంచి 9 కోట్ల రూపాయలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళం, నార్త్ అమెరికాలో గట్టిగా వసూళ్లు రాబట్టడంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ఇండియాలో 220 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఇటీవల కాలంలో లియో తర్వాత మరోసారి ఈ రేంజ్ వసూళ్లను సాధించిన ఘనతను విజయ్ దక్కించుకొన్నారు. ఇది విజయ్ కెరీర్‌లో ఓ సంచలనమనే చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











