The GOAT Day 13 Collections: విజయ్ కెరీర్‌లో ఆల్ టైం రికార్డు.. ‘ది గోట్’ ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

The GOAT Day 13 Collections: తమిళ సూపర్ స్టార్ విజయ్ (Vijay) హీరోగా, వెంకట్‌ ప్రభు (Venkat prabhu)దర్శకత్వంలో తెరక్కెకిన మూవీ 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌' (The Greatest of All Time). ఈ మూవీలో విజయ్‌ డ్యూయెల్‌ రోల్‌ చేయగా.. ప్రభుదేవా, స్నేహా, మీనాక్షి చౌదరీ, ప్రశాంత్, అజ్మల్, లైలా లు లీడ్ రోల్ లో నటించారు. ఈ మూవీ విడుద‌ల‌కు ముందేపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీ కాకుండా హీరో విజయ్ పొలిటికల్ ఏంట్రీకి ముందు వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో మరింత క్రేజ్‌ క్రియేట్‌ అయింది. తొలుత డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న తరువాత కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ది గోట్ మూవీ గత 13 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దళపతి విజయ్ 'ది గోట్' మూవీ వసూళ్ళ పరంగా దుమ్మురేపుతోంది. ఈ మూవీ కలెక్షన్ల పరంగా త‌మిళ, మ‌ల‌యాళ, ఓవ‌ర్సీస్‌లో కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన తొలి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.335 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో తొలి రోజే 100 కోట్ల మార్క్ దాటి.. రూ.126.32 కోట్లు వసూలు చేసింది. కానీ 200 కోట్ల మార్క్ దాటడానికి మాత్రం 6 రోజులు. ఇలా క్రమంగా .. 300 కోట్లు.. 400 కోట్లు మార్క్ ను దాటుకుంటూ.. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది.

The Greatest of All Time Day 13 Box Office Collections World wide vijay movie racing toward 413 Crores

వాస్తవానికి విజయ్ 'ది గోట్' బాక్సాఫీస్ దగ్గర రెండో వారం కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ .. కలెక్షన్ల పరంగా మాత్రం రచ్చ చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలో 400 కోట్ల మార్క్ దాటి .. కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) కెరీర్ లో లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.

దళపతి విజయ్ 'ది గోట్' రోజువారి కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలిరోజు రూ.44 కోట్లు, 2వ రోజు రూ.25.5 కోట్లు, 3వ రోజు రూ.33.5 కోట్లు, 4వ రోజు రూ.34 కోట్లు, 5వ రోజు రూ.14.75 కోట్లు, 6 వ రోజు రూ.11 కోట్లు వసూలు చేసింది. ఏడు ఎనిమిది రోజుల్లో వరుసగా.. రూ.8.5 కోట్లు, రూ.6.75 కోట్లు వసూలు చేసింది.ఇలా.. విజయ్ యాక్షన్-థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద తొలివారంలో రూ.178 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో మిక్స్ టాక్ తో కలెక్షన్లు కాస్తా తగ్గాయి. ఈ మూవీ 9వ రోజున రూ.6.75 కోట్లు వసూల్ చేయగా.. 10వ రోజున రూ.13.5 కోట్లు, 11వ రోజున రూ.15 కోట్లు, 12వ రోజున రూ.6.35 కోట్లు, 13వ రోజు దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసింది .

The Greatest of All Time Day 13 Box Office Collections World wide vijay movie racing toward 413 Crores

ఇక థియేట్రికల్ ఆక్యుపెన్సీ పరంగా చూస్తే.. తిరుచ్చి (68.75 శాతం), దిండిగల్ (50.75 శాతం), పాండిచ్చేరి (46.25 శాతం), కొచ్చి (42.25 శాతం), చెన్నై (42.25 శాతం)తో మంగళవారం నాటి తమిళ షోలలో GOAT మొత్తం 34.15 శాతం థియేట్రికల్ ఆక్యుపెన్సీని సొంత చేసుకుంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ -- తలపతి ఈజ్ ది గోట్ -- మంగళవారం నాటి షోలలో మొత్తం 14.35 శాతం థియేటర్లలో ఆక్యుపెన్సీని మాత్రమే ఉంది. బెంగళూరు (55.25 శాతం), హైదరాబాద్ (49 శాతం), లక్నో (38.75 శాతం) ఆక్యూపెన్సీని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద GOAT విడుదలైన 13 రోజుల్లోనే 407.85 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

గత 13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే... తమిళనాడు - 194.85 కోట్లు, తెలుగు రాష్ట్రాలు - 12.80 కోట్లు, కర్ణాటక - 26.65 కోట్లు
కేరళ - 12.85 కోట్లు, ఓవర్సీస్ - 150.30 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద GOAT విడుదలైన 13 రోజుల్లోనే సూమారు 413 కోట్ల రూపాయలను వసూలు చేసిసినట్టు తెలుస్తోంది. అంటే.. విడుదలైన 13 రోజుల్లో ఆల్ మోస్ట్ 420 కోట్ల లోపు గ్రాస్ ను అందుకున్న సినిమాగా నిలిచింది. ఇటీవల కాలంలో లియో తర్వాత మరోసారి ఈ రేంజ్ వసూళ్లను సాధించిన ఘనతను విజయ్ దక్కించుకొన్నారు. ఇది విజయ్ కెరీర్‌లో ఓ సంచలనమనే చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X