The GOAT 16 Days Collections: ది గోట్ ఆల్ టైమ్ రికార్డు.. విజయ్ సరికొత్త చరిత్ర.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. డిజాస్టర్ టాక్‌తో కలెక్షన్ల వేట ప్రారంభించిన ఈ సినిమా వసూళ్ల రాబట్టే విషయంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. టాక్ సంబంధం లేకుండా ఈ సినిమా కేవలం విజయ్ స్టార్ పవర్‌తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్నది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు వారాల బాక్సాఫీస్ జర్నీని ముగించింది. ఈ 16 రోజుల కలెక్షన్ల వివరాలు, అలాగే హిస్టరీ, రికార్డుల వివరాల్లోకి వెళితే..

ది గోట్ మూవీ తొలి రోజు 126 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వసూళ్ల యాత్రను చేపట్టిన తొలి వారం రికార్డు వసూళ్లను రాబట్టింది. ఇండియాలో తొలి 8 రోజుల్లో ఈ సినిమా 210 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది. తమిళంలో 144 కోట్లు, కన్నడలో 25 కోట్లు, తెలుగులో 13 కోట్లు, మలయాళంలో 12 కోట్లు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 16 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

The Greatest of All Time Day 16 Collections Worldwide Vijay Movie racing towards 450 crores

ఇక రెండోవారం ముగిసే సమయానికి ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం తమిళంలో 55 కోట్లు, కన్నడలో 2.5 కోట్లు, తెలుగులో 1 కోటి రూపాయలు, మలయాళంలో 1 కోటి రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 4.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 64 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెండు వారాల్లో ఇండియాలో 273 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తమిళంలో ఈ సినిమా సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఈ సినిమా కేవలం కోలీవుడ్‌లో 200 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. గతంలో కూడా లియో సినిమా ద్వారా 200 కోట్లు వసూలు చేసి.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొన్నాడు విజయ్. ఇంకా తమిళనాడులో భారీగా వసూళ్లను రాబడుతున్నది.

The Greatest of All Time Day 16 Collections Worldwide Vijay Movie racing towards 450 crores

ది గోట్ సినిమా 16వ రోజున కూడా నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 2.5 కోట్ల రూపాయల కేవలం తమిళంలోనే రాబట్టింది. ఇక ఓవర్సీస్, ఇతర ప్రాంతాలతో కలిపి ఈ సినిమా 4 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 430 కోట్లు గ్రాస్, 210 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో 200 కోట్లకుపైగా, ఓవర్సీస్ 151 కోట్ల రూపాయలు, కన్నడలో 27.5 కోట్లు, హిందీలో 20 కోట్లు, కేరళో 13 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 430 కోట్ల కలెక్షన్లను నమోదు చేసి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X