The GOAT Day 2 Box Office: 200 కోట్లకు చేరువగా ది గోట్ మూవీ.. డిజాస్టర్ టాక్‌లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

The Greatest of All Time Collections: తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించినది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ (The Greatest of All Time) చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపుతున్నది. మీనాక్షి చౌదరీ, స్నేహ, లైలా లాంటి గ్లామర్ తారలు, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ లాంటి హీరోలు నటించిన ఈ సినిమాలో ఫ్యాన్ బాయ్ మూమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో అభిమానులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సినిమా 2 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని భారీ తారాగాణంతో నిర్మించారు. ఇండస్ట్రీలోని టాప్ టెక్నిషియన్స్ పనిచేయడంతో ఈ సినిమాకు భారీగా నిర్మాణ వ్యయం అయింది. దాంతో ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయలతో నిర్మించారు.

The Greatest of All Time day 2 Collections Worldwide Vijay Movie racing toward 200 crores

ది గోట్ (The GOAT) సినిమా మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 43 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 10.5 కోట్లు, ఆంధ్రా, నైజాంలో కలిపి 3.8 కోట్లు, కేరళలో 5.8 కోట్లు, ఇతర రాష్ట్రా్లలో 3.5 కోట్లు, ఓవర్సీస్‌లో ఈ సినిమా 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక రెండో రోజు ప్రతికూల పరిస్థితులు అంటే.. టాక్ పరంగా, తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా కలెక్షన్లు సగానికి సగం పడిపోయాయి. తమిళనాడులో మాత్రం వర్కింగ్ డే రోజు అయినప్పటికీ స్టడీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తమిళనాడులో 60 శాతం ఆక్యుపెన్సీ, తెలుగు, ఇతర రాష్ట్రాల్లో 30 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

ఓవర్సీస్‌లో ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లతో కలిపి ఈ సినిమా 6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక నార్త్ అమెరికాలో రెండు రోజుల్లో 2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. గల్ఫ్ కంట్రీస్‌లో 1.35 మిలియన్ డాలర్లు రాబట్టింది. న్యూజిలాండ్‌లో 52K, ఆస్ట్రేలియాలో 500K కలెక్షన్లు రాబట్టింది.

The Greatest of All Time day 2 Collections Worldwide Vijay Movie racing toward 200 crores

విజయ్ మూవీ రెండో రోజున కూడా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తమిళనాడులో 25 కోట్ల రూపాయలు, తెలుగులో 1.5 కోట్ల నికర వసూళ్లు నమోదు చేసింది. శుక్రవారం నార్త్ ఇండియాలో రిలీజ్ కాగా.. ఈ సినిమాకు భారీ స్పందన లభించింది. ఈ చిత్రం ఉత్తరాదిలో భారీ వసూళ్లను రాబట్టింది. హిందీ వెర్షన్ చిత్రం 1.5 కోట్ల తొలి రోజున రాబట్టడంతో ఈ సినిమా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రెండో రోజు భారీగానే కలెక్ట్ చేసింది. 2వ రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో 25 కోట్ల నికర వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 175 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 190 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X