The Goat Day 2 Collections : వర్షాలు ఆపలేవంటున్న విజయ్.. ది గోట్ సెకండ్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్) సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రిలీజైన ఈ సినిమాపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ది గోట్‌లో ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, మోహన్, జయరాం, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. గత కొద్దిరోజులుగా డల్‌గా ఉన్న కోలీవుడ్ బాక్సాఫీస్ ఇళయ దళపతిపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది. ఓపెనింగ్స్ కుమ్మేసిన ఈ సినిమా రెండో రోజు ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూస్తే :
టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ది గోట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్తగా తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించిన విజయ్.. 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆయనకు ఇదే చివరి చిత్రమనే ప్రచారం ఊపందుకుంది.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్‌గా భారీగా జరిగింది. ఈ మూవీ తమిళనాడు హక్కులు రూ.75 కోట్లకు పైగా.. ఆంధ్రా, నైజాం హక్కులు రూ.21 కోట్లు.. కర్ణాటక హక్కులు రూ.11 కోట్లు, కేరళ హక్కులు రూ.15 కోట్లు, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.7 కోట్లు.. ఓవర్సీస్ హక్కులు రూ. 11 కోట్ల మేర జరిగాయి. మొత్తంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 185 కోట్ల మేర జరిగినట్లుగా ట్రేడ్ పండితులు అంటున్నారు.
ది గోట్‌ను ప్రపంచవ్యాప్తంగా 6500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో 250కి పైగా స్క్రీన్‌లలో ప్రదర్శిస్తున్నారు. ఫస్డ్ డే ఓపెనింగ్స్ విషయానికి వస్తే.. తమిళంలో రూ.40 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు, హిందీలో రూ.2 కోట్లు, కన్నడలో రూ.3 కోట్లు, కేరళలో కోటి, ఇతర రాష్ట్రాల్లో మరో కోటి చొప్పున మొత్తంగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ ఫస్ట్ డే 50 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీలో రూ.50 కోట్లు) పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సాధించింది.

మొత్తంగా ది గోట్ వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కనీసం రూ.190 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే నార్త్ ఇండియాలో మాత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిందని అంటున్నారు. నేషనల్ లెవల్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోవడం ది గోట్‌కు ప్లస్ అయ్యింది. నార్త్ బెల్ట్‌లో తొలి రోజు రూ.3.40 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు 2.0, లియో, కబాలి తర్వాత ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన కోలీవుడ్ మూవీగా ది గోట్ నిలిచింది.
రెండో రోజు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయో ఒకసారి పరిశీలిస్తే . తమిళంలో రూ. 20 కోట్లు, తెలుగు కోటిన్నర , కన్నడలో రూ.75 లక్షలు, మలయాళంలో రూ. 50 లక్షలు , హిందీలో రెండు కోట్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఓవర్సీస్‌లో మాత్రం విజయ్ జోరు చూపించే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి. అక్కడ ది గోట్ సెకండ్ డే 2 నుంచి 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా రెండో రోజు ది గోట్ వరల్డ్ వైడ్‌గా రూ.40 నుంచి రూ. 50 కోట్లు కలెక్ట్ చేయవచ్చని అంటున్నారు. మరి విజయ్ సినిమా ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూద్దాం.


Click it and Unblock the Notifications











