The GOAT Day 3 Collections: డిజాస్టర్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న విజయ్.. ది గోట్‌కు ఎన్ని కోట్లంటే?

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా 3వ రోజు రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని భారీ తారాగాణంతో నిర్మించారు. స్నేహ, మీనాక్షి చౌదరీ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్‌తోపాటు త్రిషా, శివకార్తీకేయన్ లాంటి హీరో, హీరోయిన్లు స్పెషల్ అప్పీయరెన్స్‌గా కనిపించడం,ఇండస్ట్రీలోని టాప్ టెక్నిషియన్స్ పనిచేయడంతో ఈ సినిమాకు భారీగా నిర్మాణ వ్యయం అయింది. దాంతో ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయలతో నిర్మించారు.

The Greatest of All Time Day 3 Collections Worldwide Vijay Movie racing toward 250 crores

విజయ్ నటించిన ఈ సినిమా తొలి రోజు రికార్డు వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే ఈ సినిమా 126 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక రెండో రోజు 55 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 181 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విజయ్ కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

గత రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 54 కోట్లు, కేరళలో 7.2 కోట్లు, కర్ణాటకలో 13.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 6 కోట్ల రూపాయలు వసూలు, హిందీలో 4.8 కోట్లు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 85 కోట్ల రూపాయల వరకు రాబట్టింది.

The Greatest of All Time Day 3 Collections Worldwide Vijay Movie racing toward 250 crores

ఉత్తరాదిలో ది గోట్ సినిమాకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఒక రోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 6వ తేదీన రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రానికి బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబడుతున్నది. హిందీ వెర్షన్ తొలి రోజు 2.8 కోట్లు, రెండో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 4.8 కోట్ల రూపాయలను రాబట్టింది.

ఇక 3వ రోజు ది గోట్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అన్ని చోట్ల భారీ వసూళ్లు సాధించింది. తమిళనాడులో 30 కోట్ల రూపాయలు, హిందీలో 2.15 కోట్ల రూపాయలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, కన్నడలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 38.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

The Greatest of All Time Day 3 Collections Worldwide Vijay Movie racing toward 250 crores

ది గోట్ సినిమా (The Greatest of All The Time) సినిమాకు ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు రాబడుతన్నది. ఫ్యాన్ మూమెంట్స్ అధికంగా ఉన్న ఈ చిత్రానికి నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికాలో రికార్డు వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా మూడో రోజు 475 లోకేషన్లలో 900‌K డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 3 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్స్ మూవీ మూడు రోజుల్లో బాక్సాఫీస్ సంచలనం సృష్టిస్తూ భారీ కలెక్షన్లు నమోదు చేసింది. ఈ చిత్రం మూడు రోజుల్లో 225 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 4వ రోజు 300 కోట్ల రూపాయలకు చేరువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X