The GOAT Day 5 Collections: ఆగని ది గోట్ కలెక్షన్ల ఊచకోత.. విజయ్ మూవీకి ఎన్ని కోట్ల వసూళ్లంటే?
తమిళ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్ నటించిన ది గ్రేటస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ చిత్రం డివైడ్ టాక్‌తోను బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. టాప్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మీనాక్షి చౌదరీ, స్నేహా, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ తదితరులు నటించిన ఈ సినిమా గత 5 రోజులుగా ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్ల షేర్ రాబట్టాలనే వివరాల్లోకి వెళితే..
గతంలో విజయ్‌తో బిగిల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం తమిళనాడులో హిస్టరీ క్రియేట్ చేసింది. 400 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ చిత్రం 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ధనుష్ నటించిన రాయన్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను కేవలం రెండు రోజుల్లో బ్రేక్ చేసింది.

ది గోట్ చిత్రం గత నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 108 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 22 కోట్ల రూపాయలు, ఆంధ్రా, నైజాంలో 10 కోట్ల రూపాయలు, కేరళలో 11 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 14 కోట్ల రూపయాలు, ఓవర్సీస్‌లో ఈ సినిమా 122 కోట్లు (15 మిలియన్లు) వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 300 మిలియన్ల మార్క్ దాటింది.
ఇక హిందీ వెర్షన్ ది గోట్ సినిమాకు ఉత్తరాదిలో బ్రహ్మరథం పడుతున్నారు. విజయ్ కెరీర్ ఎన్నడూలేని విధంగా ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నది. తొలి రోజు 2.8 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు 1.9 కోట్లు, మూడో రోజు 3.10 కోట్లు వసూలు చేసింది. అలాగే నాలుగో రోజు 2 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 10 కోట్లు రాబట్టింది.

విజయ్ నటించిన ఈ సినిమా 5వ రోజు కూడా భారీ వసూళ్లు రాబట్టింది. వర్కింగ్ డే రోజున కూడా నిలకడగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తమిళంలో 5వ రోజున 15 కోట్ల నికర వసూళ్లు, దక్షిణాదిలో మరో 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 17 కోట్ల రూపాయలు 5వ రోజున నమోదు చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగా వసూళ్లు సాధించడంతో 5వ రోజు కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇండియాలోని 17 కోట్ల రూపాయలతో కలిపి ఈ సినిమా 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 330 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











