The GOAT Day 6 Collections: ఓవర్సీస్‌లో చరిత్ర సృష్టించిన ది గోట్.. ఎన్ని కోట్లు వస్తే విజయ్ మూవీ లాభాల్లోకి అ

వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT) మూవీ డివైడ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ఈ చిత్రం కేరళ, తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నప్పటికి.. తమిళనాడు, ఓవర్సీస్, కన్నడ మార్కెట్‌లో దుమ్మురేపే కలెక్షన్లను నమోదు చేస్తున్నది. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా 6వ రోజు సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

విజయ్ నటించిన ఈ సినిమా గత 5 రోజుల్లో 150 కోట్లకుపైగా నికర వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం 6వ రోజున తమిళంలో భారీ వసూళ్లు రాబట్టింది. అయితే దక్షిణాదిలో మిగితా రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. తమిళంలో 10 కోట్ల రూపాయలు, తెలుగులో 70 లక్షలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో కలిపి 2 కోట్ల రూపాయలు, కన్నడలో 2.5 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షలు వసూలు చేసింది. 16 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 162 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

The Greatest of All Time Day 6 Collections Worldwide Vijay Movie rare feet in Australia and North America

ది గోట్ సినిమా ఆస్ట్రేలియాలో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరి మరో రేర్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 1.1 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 5.5 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆస్ట్రేలియాలో జైలర్, లియో, ది గోట్, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2, 2.0, విక్రమ్ సినిమా తర్వాత 7వ సినిమాగా ఈ ఘనతను సాధించింది. లియో తర్వాత రెండో సినిమాను విజయ్ 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేర్చాడు.

నార్త్ అమెరికాలో ది గోట్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. 350 లోకేషన్లలో ఈ చిత్రం 120K డాలర్లు వసూలు చేసింది. గత 5 రోజుల్లో కెనడా, అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లు అంటే 30 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. అదనంగా 120K డాలర్లను చేర్చింది. దాంతో ఈ సినిమా 30.2 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

The Greatest of All Time Day 6 Collections Worldwide Vijay Movie rare feet in Australia and North America

త్రిషా కృష్ణన్ స్పెషల్ సాంగ్‌లో నటించిన ఈ సినిమా 6వ రోజున ఇండియాలో 16 కోట్లకుపైగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 330 కోట్ల గ్రాస్, 165 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దాంతో ఈ సినిమా రెండోవారాంతంలో మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ది గోట్ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 185 కోట్ల మేర జరిగింది. దాంతో 190 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఇప్పటికే 165 కోట్ల నికర వసూళ్లు కలెక్ట్ చేసింది. ఇంకా 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తే లాభాల్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X