The GOAT Collections: విజయ్‌కు భారీగా కలెక్షన్లు.. అయినా ది గోట్‌ డిజాస్టరేనా? ఎన్ని కోట్ల నష్టమంటే?

సూపర్ స్టార్ విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ సినిమా తమిళం, ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. మిగితా ప్రాంతాల్లో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పలు చోట్ల రికార్డులు క్రియేట్ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల నష్టాల వైపు పరుగులు పెడుతున్నది. ఈ సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

విజయ్‌తోపాటు మీనాక్షి చౌదరీ, స్నేహా, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ తదితరులు నటించిన ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీని నిర్మాతలు కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ విడుదల చేశారు. ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.

The Greatest of All Time Day 7 Collections Worldwide Vijay Movie racing toward 350 crores

తమిళంలో తొలివారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 1వ రోజు 40 కోట్లు, రెండో రోజు 23 కోట్లు, మూడో రోజు 33.5 కోట్లు, 5వ రోజు 34 కోట్లు, 5వ రోజు 14 కోట్లు, 6వ రోజు 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా తమిళనాడులో 150 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఇక తెలుగులో ఈ సినిమా భారీ నష్టాలతో ముగిసేందుకు సిద్దమైంది. సుమారుగా 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మొదలు పెట్టిన ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం 10 నుంచి 11 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా దాదాపు థియేటర్లలో తుడిచి పెట్టుకుపోయిందనే చెప్పాలి.

The Greatest of All Time Day 7 Collections Worldwide Vijay Movie racing toward 350 crores

హిందీలో ఈ సినిమా ఊహించని కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తొలి రోజు 2 కోట్లు, రెండో రోజు 1.5 కోట్లు, మూడో రోజు 2.5 కోట్లు, 4వ రోజు ఈ సినిమా 3 కోట్లు, 5వ రోజు 1 కో టి, ఆరో రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతోఈ సినిమా 11 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా ఇండియాలో ముఖ్యంగా తమిళంలో నిలకడగా వసూళ్లు రాబట్టింది. బుధవారం వర్కింగ్ డే రోజున ఈ సినిమా 11 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తమిళంలో దాదాపు 7.5 కోట్ల రూపాయలు, తెలుగు, హిందీ, కన్నడ కలిపి మూవీ 3.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 7వ రోజున 13 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 335 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X