The GOAT Collections: 400 కోట్లకు చేరువగా ది గోట్.. 9వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తమిళ సూపర్ స్టార్ విజయ్, దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ సినిమా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. తమిళం, ఓవర్సీస్‌లో ఈ మూవీ స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది. విజయ్‌తోపాటు మీనాక్షి చౌదరీ, స్నేహా, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ తదితరులు నటించిన ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సినిమా 9 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే;
తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీని నిర్మాతలు కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ భారీగా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా భారీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

ది గోట్ సినిమా తొలి రోజు విజయ్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా తొలి రోజు 126 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. సౌత్ ఇండియాలోనే 44 కోట్లకుపైగా నికర వసూళ్లు సాధించింది. ఈ సినిమా తొలివారం ముగిసే సమయానికి ఇండియాలో 210 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇక రాష్ట్రాలు, భాషల వారీగా ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో ఈ సినిమా 160 కోట్లు, హిందీలో 12 కోట్లు, తెలుగులో 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కన్నడలో ఈ చిత్రం 25 కోట్లు, కేరళలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియా వైడ్ 210 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఆంధ్రా, నైజాం, కేరళలో ఈ సినిమా దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.

ది గోట్ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ చిత్రం నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్ మలేషియా, ఫ్రాన్స్, దేశాల్లో రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది.ఇంకా ఈ సినిమా నిలకడగా ఓవర్సీస్‌లో ఇంకా కలెక్షన్లను నమోదు చేస్తున్నది.
దాంతో ఈ చిత్రం 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రెండోవారంలో 400 కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే డిజాస్టర్ టాక్‌తో కూడా 400 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రంగా విజయ్ ఓ ఘనతను దక్కించుకొంటారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











