The GOAT Collections: రజనీ రికార్డును బ్రేక్ చేసిన విజయ్.. రిలీజ్‌కు ముందే ది గోట్ సంచలనం!

ఇళయ దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మించారు. సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతున్నది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ గురించిన వివరాల్లోకి వెళితే..

విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా పేర్కొంటున్న ది గోట్ (The GOAT) చిత్రాన్ని అత్యధికంగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌తో భారీగా నిర్మించారు. ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, మోహన్, జయరాం, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరీ, వైభవ్, యోగిబాబు లాంటి నటులతో మల్టీస్టారర్‌ మూవీ రేంజ్‌లో రూపొందించారు. ఈ సినిమాకు సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది.

The Greatest Of All Time Movie collections Vijay breaks Rajinikanth s Overseas Market

ఇటీవల ఓవర్సీస్‌తోపాటు తమిళంలో కూడా అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అయింది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మాత్రమే సుమారు 6 మిలియన్ డాలర్లు ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

ఇక ది గోట్ సినిమాకు భారీ స్పందన లభిస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు 6 లక్ష్ల టికెట్లను బుక్ మై షోలో అమ్మినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇంకా రెండు రోజులు ఉండగానే అత్యధిక టికెట్లు అమ్ముడుపోవడం రికార్డుగా పేర్కొంటున్నారు.

The Greatest Of All Time Movie collections Vijay breaks Rajinikanth s Overseas Market

నార్వే, ఆస్ట్రేలియా, రష్యా లాంటి చిన్న దేశాలతోపాటు యూకే, నార్త్ అమెరికా కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతున్నది. అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్లు, యూకేలో 450K పౌండ్స్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. తొలి రోజు కోసం సుమారుగా 40 కోట్ల రూపాయల కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

గతంలో ఓవర్సీస్ మార్కెట్‌లో రజనీకాంత్‌దే హవా కొనసాగేది. కానీ ప్రస్తుతం విజయ్ తన సత్తాను నిరూపించుకొన్నాడు. గత చిత్రం లియో రికార్డు స్థాయి వసూళ్లను సాధించి రజనీ నటించిన జైలర్ రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం ది గోట్ సినిమా కలెక్షన్లు కూడా తలైవా బాక్సాఫీస్ వసూళ్లను అధిగమించిందనే టాక్ వినిపిస్తున్నది.

More from Filmibeat

Read more about: the goat rajinikanth vijay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X