The Kashmir Files: మొదటిసారిగా ఎదురుదెబ్బ, 11వ రోజు డ్రాప్.. ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే?

' ది కాశ్మీర్ ఫైల్స్ ' బాక్సాఫీస్ వద్ద తొలిసారిగా వెనకడుగు వేసింది. మార్చి 11న విడుదలైన ఈ సినిమాకు రెండో సోమవారం వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. వివేక్ అగ్నిహోత్రి సినిమా 11వ రోజు తక్కువ బిజినెస్ చేసింది. మొదటి సోమవారం ఆదాయంతో పోల్చినట్లయితే, రెండవ సోమవారం ఆదాయంలో 17 శాతం నష్టం ఉంది. రెండో సోమవారం వసూళ్లు తగ్గినప్పటికీ.. సినిమా మాత్రం ధీటుగా నిలిచి రెండంకెల వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ సినిమా పూర్తి బాక్స్ ఆఫీస్ రికార్డుల విషయానికి వస్తే

జనాల్లోకి చొచ్చుకు వెళ్ళి

జనాల్లోకి చొచ్చుకు వెళ్ళి

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం త్వరలో 200 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, భాషా సుంబలి వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో పుష్కర్ నాథ్ పాత్రలో అనుపమ్ ఖేర్, బ్రహ్మదత్ పాత్రలో మిథున్, కృష్ణ పండిట్ పాత్రలో దర్శన్ కుమార్ నటించారు. సినిమా జనాల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళింది.

షోలు హౌస్‌ఫుల్‌గా

షోలు హౌస్‌ఫుల్‌గా

ఈ క్రమంలో కాశ్మీర్ ఫైల్స్ అనేక రాష్ట్రాల్లో పన్ను రహితంగా ప్రకటించబడ్డాయి. సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న కొద్దీ దానిపై వివాదాలు కూడా పెరుగుతున్నాయి. కశ్మీర్ ఫైల్స్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పాజిటివ్ మౌత్ మౌత్‌తో సినిమాకు విపరీతమైన లాభం వచ్చింది. కాశ్మీరీ పండిట్ల బాధను వివరిస్తూ తెరకెక్కిన 'ది కాశ్మీర్ ఫైల్స్' షోలు హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి.

అధిగమించి

అధిగమించి

ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా కలెక్షన్ల తాజా గణాంకాలు పంచుకున్నారు. ఆయన చేసిన ట్వీట్ ప్రకారం ది కాశ్మీర్ ఫైల్స్ సంచలనం సృష్టిస్తోంది. రెండో వారంలోనూ ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది. కరోనా మహమ్మారి అనంతర కాలంలో అత్యధిక ట్రెండింగ్ చిత్రాల్లో 'ది కాశ్మీర్ ఫైల్స్' కూడా చేరింది. 'ది కాశ్మీర్ ఫైల్స్' సూర్యవంశీ, 83, స్పైడర్‌మ్యాన్‌లను అధిగమించింది అని పేర్కొన్నారు.

చాలా అరుదుగానే

చాలా అరుదుగానే

'ది కాశ్మీర్ ఫైల్స్' రెండో శుక్రవారం 19.15 కోట్లు, రెండో శనివారం 24.80 కోట్లు, రెండో ఆదివారం 26.20 కోట్లు, రెండో సోమవారం 12.40 కోట్లు రాబట్టింది. అలా ఈ సినిమా టోటల్ కలెక్షన్ 179.85 కోట్లకు చేరుకుంది. వర్కింగ్‌డేస్‌లో కూడా ఈ సినిమా రెండంకెల వసూళ్లు సాధిస్తున్న తీరు, మిగతాల సినిమాల విషయంలో చాలా అరుదుగానే కనిపిస్తున్నాయి.

RRR శుక్రవారం విడుదల

RRR శుక్రవారం విడుదల

'ది కాశ్మీర్ ఫైల్స్' బుధవారం నాటికి 'సూర్యవంశీ' క్లోజింగ్ కలెక్షన్స్ ను దాటి కరోనా మహమ్మారి తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రం అవుతుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకి ఇంకా రెండు మూడు రోజులు మాత్ర‌మే కలెక్షన్స్ కు సమయం ఉంది.

SS రాజమౌళి తెరకెక్కించిన RRR శుక్రవారం విడుదలవుతున్నందున ఈ సినిమా గురువారం వరకు గరిష్ట వసూళ్లను సాధించడానికి ప్రయత్నిస్తుంది. RRR విడుదల 'ది కాశ్మీర్ ఫైల్స్' స్క్రీన్ కౌంట్ మరియు ఆదాయాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X