దుమ్ము రేపుతున్న ది కాశ్మీర్ ఫైల్స్..కలెక్షన్స్ లో రాధే శ్యామ్ కి డబుల్.. థియేటర్స్ త్రిబుల్
కాశ్మీరీ పండిట్ల వలస నేపథ్యంలో రూపొందిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం రెండో రోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అనుపమ్ ఖేర్,మిథున్ చక్రవర్తి నటించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' మొదటి రోజుతో పోలిస్తే రెట్టింపు వసూళ్లు సాధించింది. మరోవైపు సౌత్ సూపర్ స్టార్ మెగా బడ్జెట్ చిత్రం 'రాధే శ్యామ్'కి మేకర్స్ ఆశించిన స్థాయిలో మంచి స్పందన రావడం లేదు. బాహుబలి ప్రభాస్ 'రాధే శ్యామ్' మరియు వివేక్ అగ్నిహోత్రి 'ది కాశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ ప్[పోటీ పడ్డాయి. ఈ రెండు సినిమాలు 11 మార్చి 2022న థియేటర్లలో విడుదలయ్యాయి. రెండో రోజు ఏ సినిమా ఎన్ని కోట్ల బిజినెస్ చేసిందో తెలుసుకుందాం.

700 స్క్రీన్‌లలో
అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి నటించిన 'ది కాశ్మీర్ ఫైల్స్', దేశవ్యాప్తంగా కేవలం 700 స్క్రీన్‌లలో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతానికి అత్యంత చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా సహా అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌ల వరకు ఈ సినిమా ప్రస్తావనే నడుస్తోంది.

8.25 కోట్లు రాబట్టి
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చిత్ర బృందాన్ని కలిసినందున 'ది కాశ్మీర్ ఫైల్స్' గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. ట్రేడ్ వర్గాల అంచనా మేరకు 'ది కాశ్మీర్ ఫైల్స్' మొదటి రోజు 3.25 కోట్లు రాబట్టింది, రెండవ రోజు ఈ డబుల్ అయింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు అంటే శనివారం 8.25 కోట్లు రాబట్టింది. అంటే ఇప్పటి వరకు 'ది కాశ్మీర్ ఫైల్స్' మొత్తం పదకొండున్నర కోట్లు రాబట్టింది.

300 శాతం వృద్ధి
రెండో రోజు 'ది కాశ్మీర్ ఫైల్స్' చూపిన స్పీడ్ వెనుక యూపీ, ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో సినిమా అద్భుతంగా కలెక్ట్ చేయడం వల్లే అని అంటున్నారు. ఈ రాష్ట్రాలు సినిమాకు 300 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. అంతేకాక మొదటి రోజు 700 థియేటర్లు కాగా రెండో రోజు మూడు రేట్లు అంటే 2000 థియేటర్లకు పెరిగింది.

హిందీలో ఇప్పటి వరకు
అదే సమయంలో ప్రభాస్ 'రాధే శ్యామ్ హిందీలో రెండో రోజు కూడా 4.5 కోట్లు రాబట్టింది. అంతకుముందు శుక్రవారం అంటే మొదటి రోజు కూడా 'రాధే శ్యామ్' బాక్సాఫీస్ వద్ద 4.5 కోట్ల బిజినెస్ చేసింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ హిందీలో ఇప్పటి వరకు మొత్తం 9 కోట్లు రాబట్టింది. 'రాధే శ్యామ్' సౌత్ సహా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి మాట్లాడటం లేదు. ఇవి 'రాధే శ్యామ్' హిందీ బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రమే.

రెట్టింపు వసూళ్లు
ఇక రెండో రోజు 'ది కాశ్మీర్ ఫైల్స్' కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే.. సినిమా కలెక్షన్లు 100 శాతం పెరిగాయి. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ రెండో రోజు 8.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంటే హిందీ సినిమా చరిత్రలో తొలిసారిగా తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు వసూళ్లు రాబట్టింది. బంపర్ వసూళ్లతో వివేక్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్యాంగ్ రికార్డ్ సృష్టించింది.


Click it and Unblock the Notifications











