twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐదో రోజు రికార్డ్ కలెక్షన్స్ తో సత్తా చాటిన ది కాశ్మీర్ ఫైల్స్.. సినిమా చూసేందుకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

    |

    వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే సినిమాలు థియేటర్లలలో ఉన్నా, ఈ సినిమాకు హైప్ తక్కువగా ఉన్నా సినిమా కలెక్షన్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మార్చి 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హౌస్‌ఫుల్ షోస్ సాధిస్తోంది. 3.55 కోట్లతో మొదటి రోజు రన్ మొదలుపెట్టిన ఈ సినిమా రెండవ రోజు నుండి డబుల్ డిజిట్‌లలో వసూళ్లు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఐదో రోజు ఈ సినిమా కలెక్షన్స్ 50 కోట్లు దాటేసింది. ఆ వివరాల్లోకి వెళితే

    100 కోట్ల క్లబ్‌లో

    100 కోట్ల క్లబ్‌లో

    కాశ్మీర్ ఫైల్స్ కేవలం నాలుగు రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద రూ.47.85 కోట్లు రాబట్టింది. అదే సమయంలో 5వ రోజు విపరీతమైన వృద్ధిని కనబరుస్తూ రూ.18 కోట్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా టోటల్ కలెక్షన్ రూ.60 కోట్లకు చేరుకుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో సినిమా మొదటి వారం కంటే రెండో వారం కలెక్షన్లు ఎక్కువగా రాబట్టే అవకాశం ఉంది. త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగ కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి హోలీ పండుగపైనే ఉంది.

    60 కోట్లు

    60 కోట్లు

    ఇది మార్చి 18న విడుదలయ్యే అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే'తో పోటీ పడటం కూడా ఆసక్తికరంగానే మారింది. ఐదు రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు [1వ శుక్రవారం] - రూ. 3.55 కోట్లు, 2వ రోజు [1వ శనివారం] - రూ. 8.5 కోట్లు, 3వ రోజు [1వ ఆదివారం] - రూ. 15.1 కోట్లు, 4వ రోజు [1వ సోమవారం] - రూ. 15.05 కోట్లు, 5వ రోజు [1వ మంగళవారం] -18 కోట్లు మొత్తం - రూ. 60 కోట్లు సంపాదించింది.

    అకృత్యాలను

    అకృత్యాలను

    ది కాశ్మీర్ ఫైల్స్ 1990లో కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ పండిట్‌లు అనుభవించిన దారుణమైన బాధలకు సంబందించిన నిజమైన కథను బేస్ చేసుకుని తెరకెక్కించారు. ఇది నిజమైన కథ, కాశ్మీర్ మారణహోమం బాధితులతో కాశ్మీరీ పండిట్ కమ్యూనిటీ వీడియో ఇంటర్వ్యూ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కాశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలను సినిమాలో బాగా చూపించారు.

    టాక్స్ ఫ్రీగా

    టాక్స్ ఫ్రీగా

    అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రజల నుంచి ప్రముఖుల వరకు, కాశ్మీర్ ఫైల్స్ ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాకు చాలా రాష్ట్రాల్లో టాక్స్ ఫ్రీగా ప్రకటించారు. ఇక ఈ సినిమా ముందు 561 థియేటర్లలో, 113 ఓవర్సీస్ స్క్రీన్లలో విడుదలైంది. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ.

    Recommended Video

    DJ Tillu Box Office Collections, ఆ రికార్డు అందుకున్న మొదటి సినిమాగా DJ Tillu | Filmibeat Telugu
    సెలవులు

    సెలవులు

    కానీ తక్కువ స్క్రీన్‌లు ఉన్నప్పటికీ, ది కాశ్మీర్ ఫైల్స్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. మార్చి 11న 'ది కాశ్మీర్ ఫైల్స్' విడుదలైంది. అదే రోజు హర్యానా ప్రభుత్వం తన రాష్ట్రంలో సినిమాపై పన్ను మినహాయింపు ప్రకటించింది. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఈ సినిమా టిక్కెట్‌పై పన్నును తొలగించారు.

    గుజరాత్ తర్వాత, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటకలో కూడా టాక్స్ ఫ్రీగా మారింది. దీని తర్వాత, గోవా, త్రిపుర, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌లలో కూడా ఈ చిత్రానికి పన్ను మినహాయింపు లభించింది. అస్సాంలో అయితే ఏకంగా సినిమా చూసేందుకు సెలవులు కూడా ప్రకటించారు.

    English summary
    The Kashmir Files hits the screens on March 11th. Here is the complete day 5 collection and box office report.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X