The Kashmir Files : బుధవారం నాడు బద్దలయ్యే కలెక్షన్స్.. నార్త్ బెల్ట్ లో రాధేశ్యామ్ కి భారీ ఎదురు దెబ్బ

అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా మార్చి 11న విడుదలైంది. విడుదలైన మొదటి రోజు మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకూ పెరుగుతూ వెళ్తున్నాయి. కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ ను వదిలి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితుల మీద తీసిన ఈ హృదయ విదారక చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రమే కాదు చాలా మంది హృదయాలను గెలుచుకుంది. మొదటి రోజూ నుంచీ ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తోంది.

ఈ 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా రివ్యూ రైటర్స్ నుంచి మాత్రమే కాదు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ఆరవ రోజు కలెక్షన్స్ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఆరవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఆ కలెక్షన్లు ఎంత అనేది తెలుసుకుందాం.

19 కోట్లు కొల్లగొట్టి

19 కోట్లు కొల్లగొట్టి

కాశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ ఆరో రోజు కలెక్షన్లలో స్ట్రాంగ్ రికార్డ్ సృష్టించింది. సినిమా వసూళ్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 19 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటిదాకా విడుదలైన తరువాత ఒక్క రోజులో ఇదే అత్యధిక వసూళ్లు. మంగళవారం నాటికి ఈ సినిమా వసూళ్లు ఒక్కరోజే రూ.18 కోట్లు రాబట్టింది.

100 కోట్ల క్లబ్‌లో

100 కోట్ల క్లబ్‌లో

ఇక ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరబోతోంది. ప్రస్తుతానికి మొత్తం వసూళ్లు రూ.79.25 కోట్లకు చేరాయి. వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ''కాశ్మీర్ ఫైల్స్ సంచలనం సృష్టిస్తోంది,. అపోహలు బద్దలై బాక్సాఫీస్ రికార్డులను ధ్వంసం చేస్తోంది' అని సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

మొత్తం 79.25 కోట్లు

మొత్తం 79.25 కోట్లు

ఇక విడుదలైనప్పటి నుంచి రోజు వారీగా వచ్చిన కలెక్షన్స్ వివరాలు చూస్తే శుక్రవారం 3.55 కోట్లు, శనివారం 8.50 కోట్లు, ఆదివారం 15.10 కోట్లు, సోమవారం 15.05 కోట్లు, మంగళవారం 18 కోట్లు, బుధవారం 19.05 కోట్లు, మొత్తం 79.25 కోట్లు సాధించింది. ఇక కరోనా మహమ్మారి తర్వాత మొదటి బుధవారం (ఆరో రోజు) అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఇది నిలిచిందని తరణ్ ఆదర్శ్ మరో ట్వీట్ చేశారు. ఆ లెక్క ప్రకారం కాశ్మీర్ ఫైల్స్: రూ. 19.05 కోట్లు. సూర్యవంశీ: 9.55 కోట్లు. గంగూబాయి: రూ.6.21 కోట్లు వసూలు చేశాయి.

నార్త్ బెల్ట్ లో భారీ దెబ్బ

నార్త్ బెల్ట్ లో భారీ దెబ్బ

కరోనా కంటే ముందు తాన్హాజీ రూ. 16.72, ఉరి రూ. 7.73 కోట్లు వసూలు చేశాయని పేర్కొన్నారు. అయితే హిందీ వెర్షన్ రాధేశ్యామ్ ఆరు రోజుల్లో రూ.18.51 కోట్లు వసూలు చేయగా ఆ మొత్తాన్ని ఒక్క రోజులోనే ది కాశ్మీర్ ఫైల్స్ సాధించడం గమనార్హం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాధేశ్యామ్ కి ఇది నార్త్ బెల్ట్ లో భారీ దెబ్బ అనే చెప్పాలి.

Recommended Video

The Kashmir Files ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా PM Modi ప్రశంసలు Tax సైతం మినహాయింపు | Oneindia Telugu
మనందరి విజయం

మనందరి విజయం

ఈ సినిమా విజయం పట్ల అనుపమ్ ఖేర్ కూడా సంతోషంగా ఉన్నాడు. ఇది సినిమా ప్రపంచానికి దక్కిన విజయమని సినిమా వసూళ్లపై ట్వీట్ చేశారు. రెండేళ్లుగా కోవిడ్‌తో పోరాడుతున్నామని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. అంతా మూసేశారు.

ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్లలేకపోయారు! ఇప్పుడు నిజం ఆధారంగా తీసిన చిన్న సినిమా #TheKashmirFiles 6 రోజుల్లో 80 కోట్లు రాబట్టింది. ఇది సినిమా విజయం. ఇది సంయమనం సాధించిన విజయం.. ఇది సినిమా ప్రపంచం సాధించిన విజయం.. మనందరి విజయం. ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు! అంటూ ఆయన ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X