The Kashmir Files collections ఓవర్సీస్‌లో కలెక్షన్ల కుంభవృష్టి.. 150 కోట్ల టార్గెట్‌తో
కశ్మీరి పండితులపై పాక్ మిలిటెంట్ల ఉగ్రదాడుల నేపథ్యంగా తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతున్నది. మౌత్ టాక్‌తో విశేషంగా ఆదరణను కూడగట్టుకొన్న ఈ చిత్రం దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌ను కమ్మేస్తున్నది. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని, ఆలోచనాశక్తిని కలిగించడంలో సఫలం కావడంతో రోజు రోజుకు కలెక్షన్ల వేగం పుంజుకొన్నది. పలు చోట్ల రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఓవర్సీస్ ది కాశ్మీర్ ఫైల్స్ వసూలు చేసిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో
బాలీవుడ్ ప్రముఖుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి రచన, దర్శకత్వంలో రూపొందిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయ్ మండ్లేకర్ నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తోపాటు తేజ్ నారాయణ్ అగర్వాల్; అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి నిర్మాతలుగా వ్యవహరించారు.

7 రోజుల్లోనే 100 కోట్లు
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం అతి తక్కువగా అంటే.. 10 నుంచి 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే ఈ చిత్రం కేవలం 7 రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. అంతేకాకుండా రెండోవారంలో కూడా తొలివారానికి ఏ మాత్రం తగ్గుకుండా వసూళ్లను సాధిస్తున్నది.

100 స్క్రీన్ల నుంచి 300 స్క్రీన్లకు
ఇక ఓవర్సీస్‌లో ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం తొలివారంలో 11.4 కోట్లు అంటే.. 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. మిడిల్ ఈస్ట్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ చిత్రాన్ని తొమ్మిది దేశాల్లో సుమారు 100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. రోజు రోజుకు ఈ సినిమాపై ఆదరణ పెరిగిన క్రమంలో 25 దేశాల్లో 350 స్క్రీన్లకు పెంచారు.

యూఎస్‌లో మిలియన్ డాలర్ క్లబ్‌లోకి
ఇక ఉత్తర అమెరికాలో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లను రాబట్టింది. యూకేలో ఈ చిత్రం 160K అమెరికన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 262K అమెరికన్ డాలర్లు రాబట్టింది. తొలివారంలో ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా బాక్సాఫీస్ వద్ద టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. గతంలో ఏ భారతీయ సినిమాకు దక్కని విధంగా ఆస్ట్రేలియాలోని గెరాల్డ్‌టన్, బన్‌బురీ, పోర్ట్ హెడ్‌లాండ్ లాంటి నగరాల్లో భారీ సంఖ్యలో చిత్రాన్ని ప్రేక్షకుల వీక్షిస్తున్నారు.

ఓవరాల్‌గా 117 కోట్లు
గత శుక్రవారం అంటే మార్చి 11వ తేదీన రిలీజైన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం గత 8 రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 8 రోజున అంటే సుమారు 20 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఓవరాల్‌గా సుమారు 117 కోట్ల మేర వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం దూకుడు చూస్తే.. ఎలాంటి శ్రమ లేకుండా కనీసం 150 కోట్ల కలెక్షన్ల మైలురాయిని అధిగమించే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











