The Kerala Story collections 150 కోట్ల క్లబ్‌లో చేరిన కేరళ స్టోరి.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం
ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండో వారంలో కూడా ప్రభంజనం కొనసాగిస్తున్నది. మీడియం రేంజ్ బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా వివాదాస్పద అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. కేవలం 9 రోజుల్లో 100 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం 200 కోట్ల రూపాయల మైలురాయి వైపు పరుగులు పెడుతున్నది. ఈ చిత్రం 11వ రోజున ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..
తెలుగు వెర్షన్‌కు భారీ కలెక్షన్లు:ది కేరళ స్టోరి (The Kerala Story) తొలుత కేవలం హిందీ వెర్షన్‌లోనే రిలీజైంది. అయితే రెండోవారంలో ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను కూడా ప్రదర్శిస్తున్నారు. రెండోవారంలో తొలి రోజు 1 లక్ష రూపాయలు, రెండో రోజు 4 లక్షలు, మూడో రోజు 5 లక్షలు, నాలుగో రోజు 35 లక్షలు వసూలు చేసింది. తెలుగులో కూడా రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకొంటూ వెల్లడం ట్రేడ్ వర్గాల్లో జోష్ కలిగిస్తున్నది.

వీకెండ్‌లో రికార్డు వసూళ్లు:ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం తొలివారంలోనే 80 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. వారాంతం శని, ఆదివారాల్లో రికార్డు కలెక్షన్లను సాధించింది. శనివారం 20 కోట్ల మేర, ఆదివాంర 24 కోట్ల మేర వసూళ్లను ఇండియాలోనే సాధించింది. సోమవారం రోజు గత వారం రోజుల్లో మాదిరిగానే స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను సాధించింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో:ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ రెండు దేశాల బాక్సాఫీస్ వద్ద టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఆస్ట్రేలియాలో 235k డాలర్లు అంటే 1.40 కోట్లు, న్యూజిలాండ్‌లో 50K డాలర్లు అంటే 30 లక్షల రూపాయలు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 11వ రోజు:ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం 11వ రోజు నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం సోమవారం 20 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. అలాగే ఈ చిత్రం 11వ రోజున 10 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించింది. ఈ సినిమా త్వరలోనే 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరేందుకు రెడీ అయ్యింది.


Click it and Unblock the Notifications











