The Kerala Story collections 250 కోట్లకు చేరువగా ది కేరళ స్టోరి.. ఆస్ట్రేలియాలో నిషేధించాలనే డిమాండ్!
ది కేరళ స్టోరి చిత్రం (The Kerala Story) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కొనసాగిస్తూనే ఉంది. విడుదలైన 15 రోజుల తర్వాత కూడా ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటికే 150 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసిన ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్‌కు చేరువైంది. అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంబంధించిన 15వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ది కేరళ స్టోరి చిత్రం (The Kerala Story) చిత్రం రిలీజ్‌కు ముందే వివాదాస్పదమవ్వడంతో మంచి క్రేజ్, పబ్లిసిటీని సొంతం చేసుకొన్నది. దాంతో తొలి రోజు నుంచే ఈ చిత్రం భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. తొలి రోజు 8 కోట్లతో మొదలైన కలెక్షన్ల యాత్ర ప్రతీ రోజు 10 కోట్లకు తగ్గకుండా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలివారంలో కేవలం హిందీ వెర్షన్ 81 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఇక ది కేరళ స్టోరి చిత్రం (The Kerala Story) చిత్రం రెండో వారంలో తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ ఓ వైపు జైత్రయాత్రను కొనసాగిస్తుంటే.. తెలుగులో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెండోవారంలో హిందీ వెర్షన్ 90 కోట్లు రాబడితే.. తెలుగు వెర్షన్ 1.6 కోట్లు వసూలు చసింది.
ది కేరళ స్టోరి చిత్రం (The Kerala Story) చిత్రం 15వ రోజున కూడా మంచి ఆక్యుపెన్సీతో వసూళ్లను సాధించింది. మూడో వారంలో కూడా భారీ వసూళ్లను రాబట్టడం గమనార్హం. ఈ చిత్రం 15వ రోజున సుమారు 25 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. కొత్త సినిమాలను, ఐబీ7 లాంటి సినిమాల కలెక్షన్లను కూడా ఎదురించి బాక్సాఫీస్ వద్ద నిలబడింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ది కేరళ స్టోరి సినిమా ప్రదర్శనను నిషేధించాలనే డిమాండ్ మొదలైంది.
ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ రెండు దేశాల బాక్సాఫీస్ వద్ద టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఆస్ట్రేలియాలో 350k డాలర్లు, న్యూజిలాండ్‌లో 1000K డాలర్ వసూలు చేసింది.

ది కేరళ స్టోరి చిత్రం (The Kerala Story) చిత్రం 15వ రోజున సుమారు 7 కోట్ల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది. హిందీలో 6.4 కోట్లు వసూలు చేయగా, తెలుగులో 6 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 200 కోట్లకు చేరువైంది. తొలి వారం 82 కోట్లు, రెండో వారం 90 కోట్లు, 15వ రోజు 6 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో ఈ చిత్రం 178 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











