The Kerala Story collections బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన ది కేరళ స్టోరి..పఠాన్ మూవీ తర్వాత ఆ రేంజ్ కలెక్షన్లతో

లవ్ జిహద్ కథా నేపథ్యంతో హిందూ అమ్మాయిలను బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చే ఐసీసీ కుట్ర స్టోరి ఆధారంగా రూపొందిన చిత్రం ది కేరళ స్టోరి. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దర్శకుడు విపుల్ షా ఈ సినిమాను నిర్మించగా, యువ దర్శకుడు సుదిప్టో సేన్ దర్శకత్వం వహించారు. వివాదాస్పద చిత్రంగా ముద్ర వేసుకొన్న ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహాని, సిద్ది ఇద్నానీ, సోనియా బలానీ, విజయ్ వర్మ తదితరులు నటించారు. ఈ సినిమా 18వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

ది కేరళ స్టోరి చిత్రం సుమారు 34 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడటంతో 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని 35 కోట్లుగా నిర్ణయించారు. ఈ సినిమాను నిర్మాత విపుల్ షా సొంతంగా రిలీజ్ చేసుకోవడంతో చాలా వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. దాంతో నిర్మాత పెట్టుకొన్న లక్ష్యం ప్రకారమే బ్రేక్ ఈవెన్ నిర్ణయించారు.

The Kerala Story 18 Days collections worldwide: Adah Sharma movie joined in 200 crores club after Pathaan in 2023

ది కేరళ స్టోరి చిత్రం తొలివారం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ప్రతీ రోజు సగటను 12 కోట్లకు తగ్గకుండా నిలకడగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి వారమే 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా? అనే అనుమానం కలిగింది. అయితే ఈ చిత్రం తొలివారం 82 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసింది. అయితే రెండో వారం కూడా కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగించింది.

ది కేరళ స్టోరి తొలివారానికి ధీటుగా వసూళ్లను రాబట్టింది. రెండోవారంలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. రెండోవారంలో ఈ చిత్రం హిందీలో 89 కోట్లు, తెలుగులో 1.6 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 90.6 కోట్ల భారీ కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు వారాల్లోనే 150 కోట్ల క్లబ్‌లో చేరింది.

The Kerala Story 18 Days collections worldwide: Adah Sharma movie joined in 200 crores club after Pathaan in 2023

ది కేరళ స్టోరి మూడో వారంలో కూడా అదే జోష్‌ను కొనసాగించింది. 15వ రోజు ఈ చిత్రం హిందీలో 6.5 కోట్లు, తెలుగులో 1 కోటి రూపాయలు రాబట్టింది. ఇక 16వ రోజు హిందీలో 9 కోట్లకుపైగా, తెలుగులో 10 లక్షలు, 17వ రోజు హిందీలో 11 కోట్లకుపైగా, తెలుగులో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక సోమవారం కూడా భారీగానే వసూళ్లను నమోదు చేసింది. 18వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 5.5 కోట్లను రాబట్టింది.

The Kerala Story 18 Days collections worldwide: Adah Sharma movie joined in 200 crores club after Pathaan in 2023

ది కేరళ స్టోరి చిత్రం 2023 సంవత్సరంలో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం తర్వాత ఆ రేంజ్ కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా బాక్సాఫీస్ చరిత్రను తిరగ రాసింది. ప్రస్తుతం ఇండియాలోనే ఈ చిత్రం 200 కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించింది. ఈ చిత్రం త్వరలోనే 250 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఈ చిత్రం తొలివారంలోనే లాభాల్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ చిత్రం 75 కోట్లకుపైగా లాభాలను ఆర్జించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X