The Kerala Story 2 Day 1 Box Office: ది కేరళ స్టోరి 2 బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
అత్యంత వివాదాస్పద అంశాల మధ్య ది కేరళ స్టోరి 2 సినిమా విడుదలకు సిద్దమైంది. కేరళ ప్రభుత్వ అభ్యంతరాలు, కోర్టు కేసులు, వాదనల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్ షా తన సన్‌షైన్ బ్యానర్‌పై నిర్మించారు. కేరళ, ఇతర ప్రాంతాల్లో జరిగిన వాస్తవ సంఘటనలు, హిందూ అమ్మాయిలను బలవంతంగా మతమార్పడి చేసి సిరియాకు తరలించే కుట్రల నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు ఆషిన్ ఏ షా, రవిచంద్ నల్లప్ప సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా కీలక పాత్రలు పోషించారు. విపుల్ అమృత్‌లాల్ షా కథ అందించిన ఈ చిత్రానికి మన్నన్ షా మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా సంజయ్ శర్మ, అభిజిత్ చౌదరీ సినిమాటోగ్రఫి, సౌండ్ డిజైనర్‌గా మానస్ చౌదరీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా జుహీ తల్మాకీ వ్యవహరించారు. ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

ది కేరళ స్టోరీ సినిమాకు ఫ్రాంచైజీగా వస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ది కేరళ స్టోరి పార్ట్ 1 సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 243 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 259 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు, 302 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా నిర్మాతకు భారీ లాభాలను పంచిపెట్టింది.
ఇక ది కేరళ స్టోరి 2 సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ మూవీని సుమారుగా 25 కోట్ల రూపాయలతో తెరకెక్కించారని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాను సొంతంగా విపుల్ షా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చిత్రంగా విడుదలకు చేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 70 నుంచి 80 కోట్ల రూపాయల షేర్‌గా వాల్యూ కట్టారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ది కేరళ స్టోరి సినిమా మొదటి రోజు 8 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. అయితే టాక్ పాజిటివ్‌గా స్ప్రెడ్ కావడంతో రెండో రోజు 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే కేవలం హిందీ భాషలోనే రిలీజ్ చేయడం వల్ల అధికంగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే ది కేరళ స్టోరి 2 సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ది కేరళ స్టోరీ 2 చిత్రం తొలి రోజు సుమారుగా 12 నుంచి 15 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను సాధించే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. హిందీ వెర్షన్ సుమారుగా 7 కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తుందని అంచనా వేశారు.


Click it and Unblock the Notifications











