The Kerala story 2 Box Office: షాకింగ్‌గా ది కేరళ స్టోరీ 2 కలెక్షన్లు.. నష్టాల నుంచి బయట పడాలంటే?
ది కేరళ స్టోరి 2 చిత్రం రిలీజ్‌కు ముందు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారి భారీగా అంచనాలు పెంచే ప్రయత్నం చేసింది. కోర్టు కేసులు, రిలీజ్ వాయిదా వ్యవహారాలు ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై ఊహించని విధంగా ప్రభావం చూపించాయి. దాంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా అంటే.. అటు ఉత్తరాదిలోను.. ఇటు దక్షిణాదిలోను ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. దాంతో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు పటాపంచలైపోయాయనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. ఈ సినిమా 13 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఇక ది కేరళ స్టోరి 2 సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ మూవీని సుమారుగా 28 కోట్ల రూపాయలతో తెరకెక్కించారని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాను సొంతంగా విపుల్ షా రిలీజ్ చేశారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 80 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ సినిమా రిలీజ్‌పై కేరళ హైకోర్టు స్టే విధించడంతో తొలి రోజు ఆలస్యంగా థియేటర్లలో స్క్రీనింగ్ అయింది. దాంతో తొలి రోజు కలెక్షన్లు భారీగా క్షీణించాయి. సాక్ నిక్ సమాచారం ప్రకారం.. తొలిరోజు 75 లక్షల నెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. రెండో రోజు ఈ సినిమా 4.65 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.75 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 2.5 కోట్ల రూపాయలు, ఐదో రోజు 4 కోట్ల రూపాయలు, ఆరో రోజు 3.5 కోట్ల రూపాయలు, ఏడో రోజు 2.75 కోట్లతో తొలివారం ముగించింది.
ఇక ఈ సినిమా రెండో వారంలో కూడా పుంజుకోలేకపోయింది. కానీ నిలకడగా వసూళ్లను సాధించడం గమనార్హం. 8వ రోజు 2.7 కోట్లు, 9వ రోజు 3.75 కోట్ల రూపాయలు, పదో రోజు 3.35 కోట్ల రూపాయలు, 11వ రోజు 2 కోట్ల రూపాయలు, 12వ రోజు 2.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక బుధవారం 13వ వ రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
ది కేరళ స్టోరీ 2 సినిమాకు సంబంధించి.. ఇండియా వైడ్ ఈ సినిమా ఇప్పటి వరకు 37 కోట్ల రూపాయల నెట్, 43 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. అయితే ఓవర్సీస్ వసూళ్ల వివరాలు అందుబాటులో లేని కారణంగా వెల్లడించడం లేదు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇక కేరళ స్టోరీ 2 విషయానికి వస్తే.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్ షా తన సన్‌షైన్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు ఆషిన్ ఏ షా, రవిచంద్ నల్లప్ప సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా కీలక పాత్రలు పోషించారు. విపుల్ అమృత్‌లాల్ షా కథ అందించిన ఈ చిత్రానికి మన్నన్ షా మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా సంజయ్ శర్మ, అభిజిత్ చౌదరీ సినిమాటోగ్రఫి, సౌండ్ డిజైనర్‌గా మానస్ చౌదరీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా జుహీ తల్మాకీ వ్యవహరించారు. ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











