The Kerala Story 2 Day 7 Collection: పుంజుకున్న ‘ది కేరళ స్టోరీ 2’ కలెక్షన్లు.. 7 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
The Kerala Story 2 Day 7 Collection: వివాదాల మధ్య విడుదలైన బాలీవుడ్ మూవీ 'ది కేరళ స్టోరీ 2'. ఈ మూవీ బాక్సాఫీస్ ప్రయాణం జోరుగా కొనసాగిస్తోంది. మత మార్పిడి అంశం, కోర్టు కేసులు, రాజకీయ చర్చలతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. పలు కీలక పరిణామాలు, కోర్టు తీర్పు తరువాత ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుంచే అనేక వివాదాలు చుట్టుముట్టినప్పటికీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది. రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? 7 రోజుల్లో వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
వివాదాల మధ్య విడుదల
'ది కేరళ స్టోరీ 2' సినిమాను ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా తన 'సన్‌షైన్ పిక్చర్స్' బ్యానర్‌పై నిర్మించారు. కేరళలో జరిగినట్లు చెబుతున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా హిందూ యువతులను బలవంతంగా మతమార్పిడి చేసి విదేశాలకు తరలించే కుట్రల నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. ఈ సినిమాకు దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. సినిమాలో ప్రధాన పాత్రల్లో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా నటించారు. వీరి నటన కథకు బలంగా నిలిచిందని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది.

ఈ సినిమాకు విపుల్ అమృత్‌లాల్ షా కథ అందించగా, మన్నన్ షా సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను అభిజిత్ చౌదరీ, ఎడిటింగ్‌ను సంజయ్ శర్మ, సౌండ్ డిజైన్‌ను మానస్ చౌదరీ నిర్వహించారు. అలాగే జుహీ తల్మాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు. సినిమా నిర్మాణంలో ఆషిన్ ఏ షా, రవిచంద్ నల్లప్ప సహ నిర్మాతలుగా వ్యవహరించారు. మధ్యస్థాయి బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వివాదాస్పద అంశాల కారణంగా విడుదలకు ముందే పెద్ద చర్చకు దారితీసింది.
బడ్జెట్ ఎంత?
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణానికి సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో నటీనటుల పారితోషికాలు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు అన్నీ కలిపి ఈ మొత్తం అయ్యిందని చెబుతున్నారు. అదే సమయంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ. 30 కోట్ల వరకూ జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 30 కోట్ల షేర్, సుమారు రూ. 60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తే హిట్ జాబితాలో చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
బాక్సాఫీస్‌పై ప్రభావం
'ది కేరళ స్టోరీ 2' సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఆసక్తికర కొనసాగిస్తోంది. విడుదలకు ముందు నుంచే వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమా మొదటి రోజు మాత్రం పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయింది. పరిమిత థియేటర్లలో మాత్రమే రిలిజ్ కావడం, కోర్టు తీర్పు కారణంగా ఉదయం షోలు రద్దు కావడం వంటి అంశాలు కలెక్షన్లపై ప్రభావం చూపాయి. దాంతో తొలి రోజు ఈ సినిమా కేవలం రూ. 75 లక్షలు మాత్రమే వసూలు చేసింది.అయితే రెండో రోజు నుంచి పరిస్థితి మారింది. ప్రేక్షకుల ఆసక్తి పెరగడంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. రెండో రోజు ఈ సినిమా రూ.4.65 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ రూ. 4.75 కోట్లు సాధించింది. ఈ రెండు రోజుల కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంది.
నాలుగో రోజు కొద్దిగా డ్రాప్ కనిపించింది. వర్కింగ్ డే ప్రభావంతో కలెక్షన్లు తగ్గి రూ. 2.5 కోట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఐదో రోజు మళ్లీ సినిమా ఊపందుకుంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఆ రోజు రూ. 4 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మరోసారి బలంగా నిలబడింది. ఇక ఆరో రోజు కలెక్షన్ పెరిగాయి. హోలీ పండుగ సెలవులు ఉండటం ఈ సినిమాకు కొంత మేర ప్లస్ అయింది. దాంతో ఆరో రోజు కూడా సినిమా మంచి వసూళ్లు నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఆరో రోజు రూ. 3.5 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ సినిమా విడుదలైన 6 రోజుల్లో రూ. 20.15 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్లు సుమారు రూ. 23.77 కోట్లుగా నమోదయ్యాయి. మొదటి రోజు స్లోగా ప్రారంభమైనప్పటికీ, తర్వాతి రోజుల్లో సినిమా క్రమంగా పుంజుకుని ఈ స్థాయికి చేరుకుంది.
ఇక ఏడో రోజు కలెక్షన్స్ కాస్త తగ్గే అవకాశముంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. 7 వ రోజు ( గురవారం)దేశవాప్తంగా రూ. 3 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ అందుకునే అవకాశముందట. ఈ లెక్కన చూస్తే.. సినిమా విడుదలైన 7 రోజుల్లో రూ. 23 కోట్లు నెట్ కలెక్షన్లు,గ్రాస్ కలెక్షన్లు సుమారు రూ. 26 కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లతో నిర్మాతలు తమ పెట్టుబడిలో దాదాపు 75 శాతం రికవరీ చేసుకున్నట్టు టాక్. సినిమా పూర్తిస్థాయి సక్సెస్ ట్యాగ్ పొందాలంటే ఇంకా సుమారు రూ. 5 కోట్లు అవసరమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే వీకెండ్‌లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండటంతో ఈ టార్గెట్ ను త్వరలోనే చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











