The Kerala Story collections 200 కోట్లపై కన్నేసిన ది కేరళ స్టోరి.. 10వ రోజు సంచలన కలెక్షన్లు!
ది కేరళ స్టోరి (The Kerala Story) మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రతీ రోజు కలెక్షన్లు పెంచుకొంటూ రికార్డు దిశగా జర్నీని కొనసాగిస్తున్నది. 9 రోజుల్లోనే 100 కోట్లు కేవలం ఇండియాలోనే వసూలు చేసిన ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరేందుకు పరుగులు పెడుతున్నది. ది కేరళ స్టోరి చిత్రం 10వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
9 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్లు:ది కేరళ స్టోరి చిత్రం సుమారు 30 కోట్ల వ్యయంతో రూపొందింది. ఇండియాలోనే ఈ సినిమాను 2000 థియేటర్లలో రిలీజై.. రెండోవారంలో భారీగా స్క్రీన్ల సంఖ్యను పెంచుకొన్నది. ఈ చిత్రం తొలివారం ఈ సినిమా 80 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తొమ్మిది రోజుల్లో 113 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

రెండో వారంలో రికార్డు వసూళ్లు:ది కేరళ స్టోరి సినిమా తొలివారం తర్వాత రెట్టింపు కలెక్షన్లను సాధిస్తున్నది. 8వ రోజు నుంచి తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా 8వ రోజు హిందీలో 12.34 కోట్లు, తెలుగులో 1 లక్ష రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 12.35 కోట్లు రాబట్టింది. తొమ్మిది రోజు హిందీలో 19 కోట్లు, తెలుగులో 4 లక్షలు రాబట్టింది. దాంతో 19.5 కోట్లు వసూలు చేసింది.

10వ రోజు ఆక్యుపెన్సీ :ది కేరళ స్టోరి చిత్రం 10వ రోజు మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసింది. మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాట్నీకి 62 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఫస్ట్ షోకు 72 శాతం, సెకండ్ షోకు 82 శాతం కలెక్షన్లు నమోదు చేసింది. దాంతో ఈ సినిమాపై క్రేజ్ ఎంత ఉందో స్పష్టమైంది. అయితే గత పది రోజులుగా నిలకడగా వసూళ్లను రాబట్టింది.

10 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే? :ది కేరళ స్టోరి సినిమా 10వ రోజు భారీగా కలెక్షన్లు పెరిగాయి. ఈ చిత్రం ఆదివారం 10వ రోజున 24 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 10 రోజుల్లో 137 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సోమవారం 150 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











