The Kerala Story day 3 collections వసూళ్లతో దుమ్మురేపుతున్న ది కేరళ స్టోరి.. 3 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే
ఇండియాలో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఇస్లాం మతంలోకి బలవంతపు మత మార్పిడిలకు పాల్పడుతున్న ఐసీసీ (ISIS) కథా నేపథ్యంగా తెరకెక్కిన ది కేరళ స్టోరి చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నది. అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. సుదీప్టో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్ లాల్ శర్మ ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అయితే ఈ సినిమా 3వ రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..
2000 స్క్రీన్లలో రిలీజ్: ది కేరళ స్టోరి చిత్రాన్ని మీడియం రేంజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత, దర్శకుడు విపుల్ శర్మ తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్‌కు భారీ క్రేజ్ రావడంతో ఇండియాలో 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తొలి వారం తర్వాత ఈ సినిమా థియేటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

3వ రోజు ఆక్యుపెన్సీ: ది కేరళ స్టోరి చిత్రం హిందీ వెర్షన్ 3వ రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో భారీ ఆక్యుపెన్సీ నమోదు చేసింది. మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాట్నీకి 57 శాతం, ఫస్ట్ షోకు 65 శాతం, సెకండ్ షోకు 56 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా 54 శాతం ఆక్యుపెన్సీని 3వ రోజు రిజిస్టర్ చేసింది.

3 రోజుల్లో 36 కోట్లకుపైగా: ది కేరళ స్టోరి ఇండియా వైడ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు కంటే రెండు, మూడు రోజుల్లో భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. తొలి రోజు 8 కోట్లు రాబట్టగా, రెండో రోజు 11.05 కోట్లు, మూడో రోజు 16.5 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 36 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ది కేరళ స్టోరి లాభాల్లోకి రావాలంటే?: ది కేరళ స్టోరి చిత్రం మీడియం రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ప్రమోషనల్ ఖర్చులు, ప్రీ రిలీజ్ బిజినెస్‌తో కలిసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 35 కోట్లుగా నిర్ణయించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 35 కోట్ల షేర్ సాధిస్తే లాభాల్లోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు 36 కోట్లకుపైగా గ్రాస్, 17 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో వారాంతం వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications











