The Kerala Story Day 4 collections 50 కోట్లకు చేరువగా ది కేరళ స్టోరి.. బెంగాల్ నిషేధించినా ఆగని కలెక్షన్లు
లవ్ జిహాద్ పేరుతో ఇస్లాం మతంలోకి బలవంతంగా భారతీయ మహిళలను మత మార్పిడికి పాల్పడుతున్న ఐసీసీ (ISIS) కథా నేపథ్యంగా రూపొందిన ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం వివాదాస్పద సంఘటనల ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. మే 5వ తేదీన రిలీజైన ఈ చిత్రం ప్రతీ రోజు కలెక్షన్లను పెంచుకొంటూ రికార్డు విజయాన్ని దక్కించుకొనేందుకు సిద్దమైంది. ది కేరళ స్టోరి ఎలాంటి వివాదాలకు చోటిస్తున్నది? 4వ రోజు ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే..
బెంగాల్ ప్రభుత్వం నిషేధం: ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం భారీ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాను నిషేధించాలని లౌకికవాద వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తుండటంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్ర ప్రదర్శనలపై నిషేధం విధించింది.

తొలి సోమవారం ఫుల్ జోష్‌తో: దేశవ్యాప్తంగా ది కేరళ స్టోరి (The Kerala Story) సినిమాపై నిరసనలు, ఆందోళనలకు ఒకవైపు సాగుతుండగా.. మరో వైపు సానుకూల ప్రకటనలు వస్తుండటంతో ఈ సినిమాపై అటెన్షన్ భారీగా క్రియేట్ అయింది. దాంతో బాక్సాఫీస్‌కు అగ్ని పరీక్షగా నిలిచే తొలి సోమవారం రోజు లిట్మస్ట్ టెస్ట్ పాస్ అయింది. సోమవారం కూడా భారీ కలెక్షన్లు రాబట్టడంతో ఈ సినిమాకు ఎదురేలేదనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు కలిగిస్తున్నారు.
4వ రోజు ఆక్యుపెన్సీ ఎలా అంటే: తొలి వీకెండ్ తర్వాత సోమవారం ఎలాంటి చిత్రమైనా కలెక్షన్లు క్షీణించడం కనిపిస్తాయి. కానీ ది కేరళ స్టోరి (The Kerala Story) అందుకు భిన్నంగా భారీ కలెక్షన్లను సాధించింది. రకరకాల వివాదాల కారణంగా ఈ సినిమాపై ఆసక్తి పెరగడంతో ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. 4వ రోజున ఈ సినిమా దేశవ్యాప్తంగా 35 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. మార్నింగ్ షోకు 13 శాతం, మధ్యాహ్నం 25 శాతం, ఫస్ట్ షోకు 30 శాతం, సెకండ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

గత మూడు రోజుల కలెక్షన్లు ఇలా..: ది కేరళ స్టోరి (The Kerala Story) స్టోరి చిత్రం తొలి రోజు నుంచే భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. తొలి రోజు 8 కోట్లకుపైగా కలెక్షన్లు, రెండో రోజు 11.5 కోట్లు, మూడో రోజు ఆదివారం 16 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 35 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయని ఊహించే అయినప్పటికీ స్టడీగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

4వ రోజు ది కేరళ స్టోరి: ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం 4వ రోజు ట్రేడ్ పండితుల అంచనాలను మించి కలెక్షన్లు రాబట్టింది. ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం 4వ రోజున 10 కోట్లకుపైగా ఇండియాలో వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం దాదాపు 45 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 5వ రోజు 50 కోట్ల మార్కును దాటే ప్రయత్నం చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.

ది కేరళ స్టోరి లాభాల్లోకి రావాలంటే?: అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరి చిత్రాన్ని సుదీప్టో సేన్ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన విపుల్ అమృత్ లాల్ శర్మ సుమారు సుమారు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 35 కోట్ల షేర్, సుమారు 70 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్‌లో రిలీజ్ చేయలేదనే విషయం గమనార్హం.


Click it and Unblock the Notifications











