The Kerala Story Day 5 collections సల్మాన్ ఖాన్ మూవీకి మించి వసూళ్లు..ది కేరళ స్టోరికి రికార్డు కలెక్షన్లు
బాలీవుడ్ చిత్రం ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల హంగామాను క్రియేట్ చేస్తున్నది. భారతీయ మహిళలను లవ్ జిహద్ పేరుతో ఇస్లాం మతంలోకి బలవంతపు మార్పిడి చేస్తున్నారనే కథా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. సుదిప్టో సేన్ దర్శకత్వంలో సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై బాలీవుడ్ దర్శక, నిర్మాత విపుల్ షా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అదాశర్మ, యోగితా బిహాని, సిద్ది ఇద్నానీ, సోనియా బలానీ తదితరులు నటించిన ఈ సినిమా తొలి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా 5వ రోజు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన అలజడి వివరాల్లోకి వెళితే..
బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో :వివాదాస్పద అంశంతో ది కేరళ స్టోరి (The Kerala Story) సినిమా తెరకెక్కింది. ఇటీవల కాలంలో ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా కావడంతో హిందూ సానుకూల వర్గాలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. దాంతో 35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సంచలన వసూళ్లను నమోదు చేస్తున్నది. ఇండియాలో 2000 స్క్రీన్లలో రిలీజైన ఈ చిత్రం ఊహించని కలెక్షన్లను రాబడుతున్నది.

సల్మాన్ ఖాన్ మూవీ కంటే:ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం విడుదలైన 5వ రోజున బాలీవుడ్‌లో రికార్డు కలెక్షన్లు రాబట్టింది. 5 రోజుల తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ సినిమా కూడా ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కలెక్షన్లను అధిగమించలేకపోయింది.

వర్కింగ్ డే రోజున కూడా :ది కేరళ స్టోరి (The Kerala Story) 5వ రోజు అంటే మే 9వ తేదీన మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఉదయం ఆటకు 20 శాతం, మ్యాట్నీకి 30 శాతం, ఫస్ట్ షోకు 30 శాతం, సెకండ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 5వ రోజు 35 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

4 రోజుల కలెక్షన్ల వివరాలు:ది కేరళ స్టోరి (The Kerala Story) 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే తొలి రోజు 8 కోట్ల రూపాయలకుపైగా, రెండో రోజు 11.5 కోట్లు, మూడో రోజు 17 కోట్లు, 4వ రోజు 10 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ చిత్రం 46 కోట్లు రాబట్టి.. 50 కోట్ల మైలురాయికి చేరువైంది. ఐదో రోజు 50 కోట్ల క్లబ్‌లో చేరింది.

5వ రోజున ది కేరళ స్టోరి వసూళ్లు:ది కేరళ స్టోరి (The Kerala Story) స్టోరి చిత్రం వర్కింగ్ డేస్‌లో కూడా భారీగా కలెక్షన్లు నమోదు చేస్తున్నది. తొలి రోజు 8 కోట్లకే పరిమితమైన ఈ సినిమా 5 రోజు 11 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 57 కోట్లు నమోదు చేసింది. ఈ సినిమా ఊపును చూస్తే.. త్వరలోనే 100 కోట్ల మైలు రాయిని చేరుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











