The Kerala Story collections 100 కోట్ల క్లబ్‌లో ది కేరళ స్టోరి.. ఆస్ట్రేలియాలో కలెక్షన్ల సునామీ!

ది కేరళ స్టోరి (The Kerala Stroy) చిత్రం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగానే కలెక్షన్ల జోరు కొనసాగించింది. రెండోవారం నుంచి ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా ప్రదర్శిస్తుండటంతో కలెక్షన్లు రెండింతలయయే అవకాశం ఉంది. గత ఎనిమిది రోజులుగా ప్రతీ రోజు సరికొత్త రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల హవాను కొనసాగిస్తున్నది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..

తొలివారంలో 80 కోట్లు: ది కేరళ స్టోరి (The Kerala Stroy) చిత్రం తొలి రోజు 8 కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ ఖాతాను ఓపెన్ చేసింది. ఆ తర్వాత 12 కోట్ల రూపాయలకు తగ్గకుండా ప్రతీ రోజు కొత్త రేంజ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా తొలి వారం ముగిసే సమయానికి ఇండియాలో హిందీ వెర్షన్ 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

The Kerala Story Day 9 collections worldwide: Adah Sharma movie crossed 100 crores mile stone

9వ రోజు ఆక్యుపెన్సీ: ది కేరళ స్టోరి (The Kerala Stroy) స్టోరి చిత్రం రెండోవారంలో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నది. 9వ రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 27 శాతం, మ్యాట్నీకి 46 శాతం, ఫస్ట్ షోకు 50 శాతానికి పైగా, సెకండ్ షోకు 60 శాతం మేర ఆక్యుపెన్సీ సాధించింది. గత వారం రోజులుగా నిలకడగా ఈ సినిమా వసూళ్లను సాధించింది.

The Kerala Story Day 9 collections worldwide: Adah Sharma movie crossed 100 crores mile stone

9వ రోజున ఇండియా కలెక్షన్లు: ది కేరళ స్టోరి చిత్రం రెండోవారంలో మొదటి శుక్రవారం 12.5 కోట్లు సాధించింది. ఇక 9వ రోజు రికార్డు కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్రం రెండోవారం వీకెండ్‌ అంటే శనివారం ఏకంగా 20 కోట్ల రూపాయలు కేవలం ఇండియాలోనే వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇటీవల కాలంలో మీడియం రేంజ్ సినిమా ఇంత వేగంగా 100 కోట్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

The Kerala Story Day 9 collections worldwide: Adah Sharma movie crossed 100 crores mile stone

ఆస్ట్రేలియాలో 2వ రోజు వసూళ్లు: ఓవర్సీస్‌లో ది కేరళ స్టోరి (The Kerala Stroy) చిత్రం బాక్సాఫీస్ యాత్రను భారీగా మొదలుపెట్టింది. ఈ చిత్రం గురువారం 16000 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక శుక్రవారం తొలి రోజు కంటే 300 శాతానికి పైగా 67000 ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 80000 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 45 లక్షల రూపాయలు వసూలు చేసింది.

The Kerala Story Day 9 collections worldwide: Adah Sharma movie crossed 100 crores mile stone

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?: ప్రపంచవ్యాప్తంగా ది కేరళ స్టోరి (The Kerala Stroy) సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో ఈ చిత్రం 112 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. ఆస్ట్రేలియాలో 45 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఓవరాల్‌గా 113.5 కోట్లు నమోదు చేసింది. ఇంకా ఈ చిత్రం అమెరికాలోను, అలాగే యూకే, ఇతర దేశాల్లో రిలీజ్ కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X