The Kerala Story Box Office Collections: ది కేరళ స్టోరి బడ్జెట్ 15 కోట్లు.. ఎన్ని వందల కోట్ల లాభమంటే?

బాలీవుడ్‌లో యువ హీరోయిన్లు అదాశర్మ, యోగితా బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ నటించిన అత్యంత వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరి. ఈ చిత్రానికి సిదిప్టో సేన్ దర్శకత్వం వహించారు. హిందీ సినిమా రంగంలో భారీ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా స్వీయ నిర్మాణంతోపాటు క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా విపుల్ షా రచనా సహకారం కూడా చేశారు.

ఈ చిత్రానికి ప్రశాంతను మహోపాత్ర సినిమాటోగ్రఫిని, సంజయ్ శర్మ ఎడిటింగ్, విరేష శ్రీవల్స, బిషాక్ జోష్ సంగీతం అందించారు. ఈ చిత్రం 2023 సంవత్సరం మే 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ 2 మూవీ ఫిబ్రవరి 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఆ సమయంలో ఏ మేరకు కలెక్షన్లు సాధించింది? నిర్మాతకు ఎంత లాభాన్ని అందించింది అనే వివరాల్లోకి వెళితే..

The Kerala Story Life Time Box Office Collections

ది కేరళ స్టోరి సినిమా కంటెంట్‌ ప్రధానంగా రూపొందిన చిత్రం కావడంతో బడ్జెట్ మీడియం రేంజ్‌లోనే అయింది. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు సుమారుగా 15 కోట్ల రూపాయలు అయింది. ఈ సినిమాను తొలుత హిందీ వెర్షన్‌లోనే రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. మొదట ఈ సినిమాను దేశవ్యాప్తంగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత పబ్లిక్ డిమాండ్ పెరగడంతో భారీగా సినిమా స్క్రీన్లను పెంచారు. ఈ చిత్రం 25 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ది కేరళ స్టోరి రిలీజ్‌కు అనేక రకాలుగా వివాదాల్లో కూరుకుపోయి ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. దాంతో తొలి రోజు 8 కోట్ల రూపాయల వసూళ్లతో కలెక్షన్ల జర్నీని ప్రారంభించింది. తొలి వారం ముగిసే సమయానికి 81 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారం 90 కో ట్ల రూపాయలు, మూడో వారం 41 కోట్ల రూపాయలు, నాలుగో వారం 18 కోట్ల రూపాయలు, 5వ వారం 7 కోట్ల రూపాయలు, ఆరో వారం 3 కోట్ల రూపాయలు వసూలు చసింది. దాదాపు 42 రోజుల పాటు ఈ మూవీ బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.హిందీ వెర్షన్ 240 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 3 కోట్ల రూపాయల వసూలుచేసింది. ఇండియాలో మొత్తంగా అంటే సుమారుగా 243 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం దాదాపు అప్పట్లో రెండు మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో సుమారుగా 16 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 243 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 259 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు, 302 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా నిర్మాతకు 200 కోట్లకుపైగానే లాభాన్ని పంచిపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X