45 కోట్ల బడ్జెట్.. 40000 కలెక్షన్లు.. సినీ చరిత్రలోనే దారుణంగా డిజాస్టరైన మూవీ ఎంటో తెలుసా?
బాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ నటించిన ది లేడీ కిల్లర్ దారుణమైన కలెక్షన్లను రాబడుతున్నది. హిందీ సినిమా పరిశ్రమలో అత్యంత డిజాస్టర్‌గా ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అజయ్ బెహల్ దర్శకత్వంలో శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించిన ఈ సినిమా కనీసం అంచనాలను కూడా అందుకోలేకపోయింది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల అంచనాల విషయానికి వస్తే..
ది లేడీ కిల్లర్ సినిమాకు పెద్దగా రెస్సాన్స్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పరిమితమైన స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ముంబై, ఢిల్లీలో పరిమితమైన స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ముంబైలో 11 స్క్రీన్లు, ఢిల్లీలో 4, 5 స్క్రీన్లలో విడుదల చేశారు. అయితే వాటిలో కూడా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోవడం వల్ల పేలవమైన కలెక్షన్లు వసూలయ్యాయి.

ది లేడీ కిల్లర్ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ లాంటి స్టార్ హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ సినిమాను 45 కోట్ల రూపాయలతో నిర్మించారు. థియేట్రికల్ బిజినెస్ పెద్దగా కాకపోయినా.. ఓటీటీ బిజినెస్ కొంత మేరకు జరిగింది. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 55 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది.

ఇక భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది లేడీ కిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిల పడింది. తొలి ఆట తర్వాత ఈ సినిమా స్క్రీన్లన్నీ బోసి పోయాయి. దాంతో తొలి ఆట తర్వాత డిజాస్టర్ టాక్‌తో ముందుకెళ్లింది. ఈ సినిమాను థియేటర్ల నుంచి తొలగించడంతో తొలి రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ జర్నీ ముగిసింది.

ది లేడీ కిల్లర్ సినిమా ఢిల్లీ, ముంబైలో నాసిరకంగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి 500 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. దాంతో 40000 రూపాయల కలెక్షన్లు కలెక్ట్ చేసింది. ఇటీవల కాలంలో అతి తక్కువగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ ఫేట్ పూర్తిగా ముగిసిపోయిందనే చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











