100 కోట్లకు చేరువైన ది లయన్ కింగ్.. బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న సింబా
హాలీవుడ్ చిత్రం ది లయన్ కింగ్ చిత్రం భారతీయ భాషల్లో భారీగా వసూళ్లను సాధిస్తున్నది. సింబా, తిమోన్, పంబా పాత్రలు ప్రేక్షకులకు దగ్గర కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తున్నది. సరికొత్త అనుభూతికి గురిచేస్తున్న ఈ చిత్రం అత్యాధునిక సాంకేతికతతో రూపొందింది. ట్రేడ్ వర్గాల అంచనాలను పటాపంచలు చేస్తూ ఈ చిత్రం రూ.100 కోట్లకు చేరువైంది. జూలై 18న రిలీజైన ఈ చిత్రం ఎంత మేరకు వసూళ్లను సాధించిందంటే..
తొలి వారంతంలోనే ది లయన్ కింగ్ చిత్రం రూ.50 కోట్ల మార్కును అవలీలగా దాటేసింది. గత ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.75 కోట్లు సాధించి సరికొత్త గణాంకాలను నమోదు చేసింది. బుధవారం కూడా రూ.6.25 కోట్లు వసూలు చేయడంతో ఈ చిత్రం రూ.76 కోట్లు నమోదు చేసింది.

బుధవారం వసూళ్లతో ది లయన్ కింగ్ సూపర్ హిట్ అని డిసైడ్ అయింది. శుక్రవారం రూ.11.06 కోట్లు, శనివారం రూ.19.15 కోట్లు, ఆదివారం రూ.24.54 కోట్లు, మంగళవారం రూ.7.90 కోట్లు, మంగళవారం రూ.7 కోట్లు, బుధవారం రూ.6.25 కోట్లు సాధించింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ది లయన్ కింగ్ చిత్రం అవెంజర్స్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా ఘనతను సాధించింది. జాన్ ఫెవరీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సింబా అనే సింహం జీవితం ఆధారంగా తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











