బాక్సాఫీస్‌పై గర్జిస్తున్న ది లయన్ కింగ్.. 100 కోట్లకు చేరువగా..
హాలీవుడ్ చిత్రం ది లయన్ కింగ్ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర చేస్తున్నది. తొలివారం తర్వాత కూడా బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది.
ప్రస్తుత వారంలో బాలీవుడ్‌లో జడ్జిమెంటల్ హై క్యా, అర్జున్ పటియాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వాటి ఓపెనింగ్స్ అంతంతా మాత్రంగానే ఉండటం, అదీ కాకుండా లయన్ కింగ్ మంచి ప్రేక్షకాదరణ కలిగి ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

జూలై 19 తేదీన రిలీజైనప్పటి నుంచి వరుసగా రూ. 11.25 కోట్లు, రూ. 18.50 కోట్లు, రూ. 24 కోట్లు, రూ. 7.75 కోట్లు, రూ.7 కోట్లు, రూ. 6.50 కోట్లు, రూ. 5.75 కోట్లు, రూ.81 కోట్లు, రూ.5.25 కోట్లు వసూలు చేసింది. తొలివారం మొత్తం కలిపి రూ.86.25 కోట్లు రాబట్టింది.
కాగా, అర్జున్ పాటియాలా, జడ్జిమెంటల్ హై క్యా చిత్రాల విషయానికి వస్తే, సుమారు 20 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. జడ్జిమెంటల్ హై క్యా చిత్రం తొలి రోజు 3 నుంచి రూ.5 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ఇక అర్జున్ పాటియాలా రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు మాత్రం వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











