twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ది లయన్ కింగ్: ఫస్ట్ వీకెండ్ వసూళ్లు రూ. 3000 కోట్లు ఖాయం అంటున్నారు...

    |

    ఒకప్పుడు కార్టూన్ నెట్వర్క్‌లో కామిక్ సీరియల్‌గా వచ్చిన 'లయన్ కింగ్'.... 1990లో 2డి ఆనిమేటెడ్ సినిమాగా థియేటర్లోకి వచ్చింది. అప్పట్లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇపుడు ఇదే చిత్రాన్ని ఆధునిక 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ ఉపయోగించి కొన్ని మార్పులు చేసి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అమెరికా, ఇండియా, చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆయా భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఈ చిత్రం విడుదలైంది. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జులై 19న విడుదల కాబోతోంది.

    చైనాలో ఈ చిత్రం తొలి 3 రోజుల్లో 54 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల కలెక్షన్ కలిపి 450 మిలియన్ డాలర్లు(రూ. 3 వేల కోట్లు) వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    అమెరికాలో 'ది లయన్ కింగ్' జులై బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ హ్యారీ పోటర్ అండ్ డెత్లీ హాలోస్-2 పేరు మీద ఉంది. ఫైనల్ హ్యారీ పోటర్ ఫిల్మ్ 2011లో విడుదలై ఫస్ట్ వీకెండ్ 169 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే 'ది లయన్ కింగ్' 180 మిలియన్ డాలర్లు రాబడుతుందని భావిస్తున్నారు.

    The Lion King worldwide box office prediction $450 million

    ఇండియాలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నారు. నేటివిటీ ఎఫెక్ట్ కోసం లోకల్ స్టార్లతో డబ్బింగ్ చెప్పించారు. ఈ చిత్రం‌లో అతి కీల‌క‌మైన ముఫాసా పాత్రకు హీందీలో షారుఖ్ ఖాన్‌, తెలుగులో పి.ర‌విశంక‌ర్ డ‌బ్బింగ్ చెప్పారు. అలాగే ల‌యన్ కింగ్‌లో హీరో సింబా పాత్ర‌కి హిందీలో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డబ్బింగ్ చెప్ప‌గా, తెలుగు‌లో నేచుర‌ల్ స్టార్ నాని చెప్పారు.

    విల‌న్ స్కార్ పాత్ర‌కి జ‌గ‌ప‌తి బాబు, టైమ‌న్ అనే ముంగిస పాత్ర‌కి ఆలీ, పుంబ అనే అడవి పంది పాత్ర‌కి ప్ర‌ముఖ హ‌స్య‌న‌టుడు బ్ర‌హ్మ‌నందం డ‌బ్బింగ్ చెప్పారు. డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని ప్రంపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తోంది. ఈ చిత్రం విడుదల తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    English summary
    Disney’s The Lion King has already minted a healthy $54 million in its three-day China opening and is expected to make more than $450 million worldwide by the end of this weekend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X