2250 కోట్ల బడ్జెట్.. 8 కోట్ల కలెక్షన్లు.. డిజాస్టర్ కా బాప్.. ఆ సినిమా ఏంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ది మార్వెల్ చిత్రాలకు భారీ ఆదరణ, అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సమంత రుత్ ప్రభు ఇండియాలో ప్రమోట్ చేయడంతో బజ్ ఏర్పడింది. బ్రై లార్సన్, తేనా పారిస్, ఇమాన్ వెల్లానీ నటించిన ఈ సినిమా నవంబర్ 10 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే కలెక్షన్లు, బడ్జెట్ వివరాల్లోకి వెళితే..
ది మార్వెల్స్ చిత్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను 270 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఇండియాలో కేవలం 1.25 కోట్లు మాత్రమే రాబట్టింది.

ఇక ది మార్వెల్స్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద చాలా పేలవంగా వసూళ్లను రాబట్టింది. తొలి రోజు 2.5 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. రెండో రోజు 2.5 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు ఈ సినిమా కేవలం 1 కోటి రూపాయలు రాబట్టింది. ఇక నాలుగో రోజు 1.5 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో ఇండియాలో ఈ సినిమా నాలుగు రోజుల్లో 7.5 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.
ది మార్వెల్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. అమెరికాలో 46 మిలియన్ డాలర్లు, చైనా, ఇతర దేశాల్లో 62 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా తొలివారాంతానికి కేవలం 109 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇటీవల కాలంలో అతి తక్కువ వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ది మార్వెల్స్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 7.6 కోట్లు షేర్, 8.3 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 525 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 920 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇంకా భారీగా వసూలు చేస్తే తప్ప ఈ సినిమా లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల హాలీవుడ్‌లో రిలీజైన చిత్రాలతో పోల్చుకొంటే ది మార్వెల్స్ సినిమా అతితక్కువగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా గతంలో వచ్చిన కెప్టెన్ మార్వెల్ కంటే తక్కువగా వసూళ్లను సాధించింది. తొలివారాంతంలో కెప్టెన్ మార్వెల్ చిత్రం అమెరికాలో 150 మిలియన్లు, ప్రపంచవ్యాప్తంగా 456 మిలియన్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











