The Odyssey Box Office: 8 రోజుల్లో 3350 కోట్లతో ది ఒడిస్సీ సంచలనం.. ఇండియాలో నోలన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఈతాకా గ్రీక్ సమ్రాజ్యాధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ట్రోజాన్ వార్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటలన నేపథ్యంగా ది ఒడిస్సీ మూవీని ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందించారు. ఒడిస్సీగా మాట్ డామన్, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే నటించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు.

ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ, ఎడిటర్: జెన్నిఫర్ లామే, మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి బ్యానర్లపై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో, ఇతర దేశాల్లో జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రం ఇండియాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెనింగ్స్ సాధించింది. గత 7 రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

The Odyssey 8 Days Box Office Collections
ఈ సినిమాను అతి తక్కువ ఖర్చుతో 70 ఎంఎం ఐమాక్స్ వెర్షన్‌లో షూట్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 275 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు.ఈ సినిమా కోసం 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే.. ప్రమోషనల్ ఈవెంట్స్, యాడ్స్ కోసం 25 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. దాంతో ఈ సినిమా సుమారుగా భారతీయ కరెన్సీలో 2650 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు.

ఇండియాలో ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజు 17.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 22 కోట్ల రూపాయలు, మూడో రోజు 22 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 8 కోట్ల రూపాయలు, ఐదో రోజు 8.5 కోట్ల రూపాయలు, ఆరో రోజు 6.5 కోట్ల రూపాయలు, ఏడో రోజు 6 కోట్ల రూపాయలు వసూలు చేింది. తొలివారం ఈ చిత్రం 90 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా 8వ రోజు సుమారుగా 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 93.5 కోట్ల రూపాయల నెట్, 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రాల వారీగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల విషయానికి వస్ేత. మహారాష్ట్రలో 22.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 20 కోట్ల రూపాయలు, ఢిల్లీలో 16 కోట్ల రూపాయలు, తెలంగాణలో 11 కోట్ల రూపాయలు, తమిళనాడులో 9 కోట్ల రూపాయలు, కేరళలో 7 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్ల రూపాయలు, గుజరాత్‌లో 5 కోట్ల రూపాయలు, ఉత్తర ప్రదేశ్‌లో 3.5 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా త్వరలోనే 150 కోట్ల మార్కును చేరుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..ఈ చిత్రం తొలి వారం ముగిసే సమయానికి 346 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3350 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాల్లో ఇంకా స్ట్రాంగ్‌గా కలెక్షన్లను సాధిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాదాపు 73 దేశాల్లో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. అలాగే క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ది డార్క్ నైట్ సాధించిన 341 మిలియన్ డాలర్ల వసూళ్లను ది ఒడిస్సీ చిత్రం అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X