The Paradise Business: నెక్ట్స్ లెవల్‌లో ది ప్యారడైజ్ బిజినెస్.. నాని మూవీ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లంటే

నేచురల్ స్టార్ నాని హీరోగా.. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్. కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు చాలాకాలం తర్వాత ఈ సినిమా ద్వారా ‌విలన్‌‌గా భయపెట్టనున్నారు. ఆగస్ట్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ సహా 8 భాషల్లో ది ప్యారడైజ్‌ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2026లో టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలోనే భారీ అంచనాలనున్న సినిమాగా ది ప్యారడైజ్ నిలిచింది. ఈ నేపథ్యంలోనే నాని సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ది ప్యారడైజ్ థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ది ప్యారడైజ్‌ తారాగణం
ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ది ప్యారడైజ్ సినిమాను దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాఘవ్ జుయల్, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ది ప్యారడైజ్‌కు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా.. సీహెచ్ సాయి సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తోట శ్రీనివాస్ డైలాగ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.

The Paradise Theatrical Business Reports says Nani starrer Crosses 100 Crore mile stone in Pre Release business

ఆయా షేర్ సాంగ్‌కు మాస్ రెస్పాన్స్
ఇప్పటి వరకు కెరీర్‌లో ఎన్నడూ కనిపించని డిఫరెంట్‌ లుక్‌లో నానిని చూపిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. రెండు జడలు ముందుకు వేసుకుని వెరైటీ గెటప్‌లో ఉన్న నాని లుక్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కుర్రకారు ఈ లుక్ ఫాలో అవుతున్నారు. ది ప్యారడైజ్‌పై బజ్ తగ్గకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోని ఆయా షేర్ అనే సాంగ్‌ను విడుదల చేశారు. రెండు జడల గెటప్‌లో మాస్ స్టెప్పులతో డ్యాన్స్ చేశారు నాని. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను అద్దుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ సాధిస్తోంది.

ది ప్యారడైజ్‌ ఓటీటీకి రికార్డ్ ధర
మరోవైపు.. భారీ అంచనాల నేపథ్యంలో ది ప్యారడైజ్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా కంపెనీలు క్యూకడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హిందీ, ఓవర్సీస్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ ఆఫర్లతో రెడీగా ఉన్నారు. అయితే నిర్మాతలు మాత్రం కొంత వేచి చూసే ధోరణిని అనుసరించాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ డిజిటల్ రైట్స్‌‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 58 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా ఆడియో రైట్స్‌ను సరిగమప మ్యూజిక్ కంపెనీ దాదాపు 18 కోట్ల రూపాయలతో దక్కించుకుందని కొద్దిరోజుల క్రితం గాసిప్స్ వినిపించాయి. ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్‌పరంగా 70 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. ఇంకా శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ బిజినెస్ లెక్కలు తేలాల్సి ఉంది.

ది ప్యారడైజ్‌ థియేట్రికల్ బిజినెస్‌పై ఊహాగానాలు
తాజాగా విడుదల చేసిన ఆయా షేర్‌తో ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దాంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు బడా సంస్థలు పోటీలో నిలిచాయట. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ది ప్యారడైజ్‌కు వరల్డ్ ‌వైడ్‌గా 100 కోట్ల రూపాయల మేరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అదే నిజమైతే నాని కెరీర్‌లో హెయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా ది ప్యారడైజ్ నిలవనుంది. అయితే ఏరియాల వారీగా ఎంత బిజినెస్ చేసిందన్న దానిపై క్లారిటీ రాలేదు. ఈ గాసిప్స్‌ను బట్టి చూస్తే ది ప్యారడైజ్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే 100 కోట్ల రూపాయలకు పైగా షేర్.. 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు

More from Filmibeat

Read more about: The Paradise nani srikanth odela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X