The RajaSaab 3 Days Box Office: 200 కోట్లకు చేరువగా ది రాజాసాబ్.. ప్రభాస్ మూవీ నష్టాల నుంచి బయటపడాలంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సిబుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ది రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఫాంటసీ, హారర్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాలతో ఈ చిత్రం జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? రెండో రోజు సాధించిన కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేసిన ఈ సినిమాకు ఖర్చు కూడా భారీగానే అయింది. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, భారీ సెట్లు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. సుమారుగా 400 కోట్లకుపైగా బడ్జెట్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 207 కోట్ల మేర వాల్యూ చేశారు. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే కనీసం 210 కోట్ల రూపాయలు నెట్, 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 900 నుంచి 950 స్క్రీన్ల నుంచి వరకు, కర్ణాటక, తమిళనాడు, కేరళలో 600 స్క్రీన్ల మేర రిలీజ్ చేశారు. నార్త్ ఇండియాలో 3000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో 550 లోకేషన్లలో సినిమాను ప్రదర్శించారు. దాంతో ఈ సినిమాను 4500 నుంచి 5000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియర్లకు భారీగా రెస్పాన్స్ లభించింది. తొలి ఆట తర్వాత మిక్స్‌డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 5 కోట్ల రూపాయలు, తొలి రోజు 40 కోట్ల రూపాయలు, రెండో రోజు 15 కోట్ల రూపాయలు, మూడో రోజు 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రా, నైజాంలో కలిపి ఈ సినిమా 76 కోట్ల నెట్, 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. మూడో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో 20 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ది రాజా సాబ్ సినిమా ప్రాంతాల వారీగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజుల్లో నైజాంలో ఈ సినిమా 30 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 8.5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 7 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.5 కోట్లు, నెల్లూరులో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక తెలుగేతర రాష్ట్రాల్లో గత మూడు రోజుల్లో అంత మాత్రంగానే కలెక్షన్లను రాబట్టింది. కర్ణాటకలో 13 కోట్ల రూపాయలు, తమిళ, కేరళలో 3 కోట్ల రూపాయలు, హిందీలో ఈ సినిమా 19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 150 కోట్ల రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్‌లో 31 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 183 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ముందు భారీ లక్ష్యమే ఉంది. ఏ రేంజ్‌లో కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











