The Rajasaab USA Advance Collection: రాజాసాబ్ USA అడ్వాన్స్ బుకింగ్ హవా.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంట్లే?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది.

The Rajasaab USA Box Office

ది రాజా సాబ్ చిత్రాన్ని సుమారుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న ది రాజా సాబ్ చిత్రాన్ని నార్త్ అమెరికాలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేస్తున్నది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను సుమారుగా 9 మిలియన్ డాలర్లు చెల్లించి ప్రత్యాంగీరా సినిమాస్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 18 మిలియన్ డాలర్లు అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉండటంతో అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌ను నెల రోజుల ముందే ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ రెండో ట్రైలర్‌ రిలీజ్ తర్వాత మరింత సానుకూలత పెరిగింది. రాజా సాబ్ ట్రైలర్ 2.0 తర్వాత టికెట్ల అమ్మకాలు ఊపందుకొన్నాయి. ప్రభాస్ క్రేజ్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఒక్కసారి ప్రమోషన్స్ మొదలుపెడితే.. ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అమెరికాలో ది రాజాసాబ్ ప్రీమియర్లు భారీగా ప్లాన్ చేశారు. జనవరి 8 తేదీన ప్రదర్శించే ప్రీమియర్లకు రికార్డు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాదాపు 350 లోకేషన్లలో 1000 పైగా షోలను ప్రదర్శించేందుకు రెడీ చేస్తున్నారు. ఈ ప్రీమియర్ ప్రదర్శన కోసం ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా స్పందన వ్యక్తమవుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు.

ట్రేడ్ అనలిస్ట్ వెంకీ బాక్సాఫీస్, ఇతర ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు 9000 టికెట్లకుపైగా అమ్ముడుపోయాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత భారీ జంప్ కనిపిస్తున్నది. రానున్న రోజుల్లో ఈ ఆక్యుపెన్సీ రేట్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. 300000 డాలర్లకు పైగా అంటే 2.7 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X