The RajaSaab Box Office:నార్త్ అమెరికాలో ప్రభాస్ వసూళ్ల హ్యాట్రిక్..రాజాసాబ్‌తో ఓన్లీ ఇండియన్ హీరోగా రికార్డ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లోనే పీక్స్‌లో ఉన్నారు. ఆయన పేరు మీద వేలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ హీరో కూడా ఆయన దరిదాపుల్లో లేరు. ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై అతిపెద్ద సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు ప్రభాస్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్‌పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే ప్రభాస్ తన ఖాతాలో పలు రికార్డులు వేసుకున్నారు. తాజాగా ది రాజాసాబ్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
ది రాజాసాబ్ తారాగణం
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజా సాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.

ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్
ది రాజాసాబ్ చిత్రాన్ని దాదాపుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ది రాజాసాబ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ది రాజాసాబ్ మూవీకి ఓవరాల్ బిజినెస్ సుమారుగా 250కుపైగా కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ప్రభాస్ మూవీ లావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
నార్త్ అమెరికాలో ది రాజాసాబ్ రికార్డులు
ఆంధ్రప్రదేశ్ పాటు ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాలలో ది రాజాసాబ్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటకే టికెట్ కోసం పెద్ద ఎత్తు ప్రేక్షకుల ఎగబడుతున్నారు. ఇక్కడే కాదు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. రిలీజ్‌ముందే ప్రీమియర్స్ + అడ్వాన్స్ బుకింగ్‌లో ప్రభాస్ మూవీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం అమెరికాలో 526 లోకేషన్స్‌లో.. 1784 షోలకి గాను 37546 టికెట్స్ అమ్ముడయ్యాయి. తద్వారా 1030538 డాలర్లు (భారత కరెన్సీలో 9.26 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఓవరాల్‌గా నార్త్ అమెరికాలో ది రాజాసాబ్‌కు 1.1 మిలియన్ డాలర్లు (9.88 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి నార్త్ అమెరికాలో ది రాజాసాబ్‌కు ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్‌లో 1.5 మిలియన్ డాలర్లు (13.47 కోట్ల రూపాయలు) రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ది రాజాసాబ్‌తో ప్రభాస్ హ్యాట్రిక్
ది రాజాసాబ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ద్వారా నార్త్ అమెరికాలో ప్రభాస్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్‌పరంగా 1 మిలియన్ డాలర్లను వరుసగా మూడు సార్లు అందుకుని హ్యాట్రిక్ నమోదు చేశారు ప్రభాస్. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు ప్రభాస్ నటించిన సలార్, కల్కి 2898 ఏడీలు నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్‌లో 1 మిలియన్ మార్క్ అందుకున్నాయి. తాజాగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ కూడా వన్ మిలియన్ మార్క్ క్రాస్ చేయడంతో డార్లింగ్ ఈ విషయంలో హ్యాట్రిక్ అందుకున్నారు.


Click it and Unblock the Notifications











