The Rajasaab USA Box Office: నార్త్ అమెరికాలో రాజాసాబ్ కలెక్షన్స్... ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కల్కి 2898 ఏడీ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. మారుతి దర్శకత్వం వహించారు. ప్రభాస్ ఛరిష్మా టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ది రాజాసాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే దీనికి ముందు రోజే జనవరి 8న భారత్‌తో పాటు పలు దేశాల్లో రాజా సాబ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నార్త్ అమెరికాలో రాజా సాబ్‌కు ప్రీమియర్స్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చింది? ఈ వివరాల్లోకి వెళితే...
ది రాజాసాబ్ తారాగణం
రాజాసాబ్‌లో బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ ఇందులో కీలకపాత్ర పోషించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజా సాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.

ది రాజాసాబ్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజా సాబ్‌కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ది రాజాసాబ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ది రాజాసాబ్ మూవీకి ఓవరాల్ బిజినెస్ సుమారుగా 250కుపైగా కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ప్రభాస్ మూవీ లావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ది రాజాసాబ్ ఓవర్సీస్ బిజినెస్
ఓవర్సీస్‌లో ది రాజా సాబ్ సినిమాను ప్రత్యంగిరా మూవీస్ విడుదల చేస్తోంది. ఓవర్సీస్‌లో ప్రభాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే 10 మిలియన్ డాలర్లు (90 కోట్ల రూపాయలు)... నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ కావాలంటే 7.5 మిలియన్ డాలర్లు (68 కోట్ల రూపాయలు) వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు తెలిపారు. అయితే ప్రభాస్ క్రేజ్.. ఓవర్సీస్‌లో ఆయన గత రికార్డుల నేపథ్యంలో దీనిని రాజా సాబ్ సులువుగా అధిగమిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రిలీజ్‌కు ముందే మిలియన్ క్లబ్‌లోకి
అందుకు తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ది రాజా సాబ్ దుమ్మురేపింది. విడుదలకు ముందే రాజా సాబ్ ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఇలా ప్రీ సేల్స్‌లోనే ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకోవడం ప్రభాస్‌కు ఇది మూడోసారి. గతంలో కల్కి 2898 ఏడీ, సలార్ పార్ట్ 1 సమయంలో విడుదలకు ముందే ఓవర్సీస్‌లో మిలియన్ మార్క్ క్రాస్ చేశాడు ప్రభాస్.
ది రాజాసాబ్ ప్రీమియర్స్ కలెక్షన్స్
ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ విషయానికి వస్తే అమెరికాలో 526 సెంటర్స్‌లో 1784 షోలకు గాను 37546 టికెట్స్ అమ్ముడై 1030538 డాలర్లు (9.30 కోట్ల రూపాయలు) వసూలు చేసింది రాజా సాబ్. మొత్తంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ కింద ప్రభాస్ మూవీ 1.1 మిలియన్ డాలర్లు (10 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రీమియర్స్ + డే 1 అడ్వాన్స్ సేల్స్ కింద రాజాసాబ్‌కు 1.325 మిలియన్ డాలర్లు (దాదాపు 12 కోట్ల రూపాయలు) వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ది రాజా సాబ్ మూవీ నార్త్ అమెరికాలో తొలిరోజు 1.5 మిలియన్ డాలర్లు (13.5 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. భారత్‌లోని ప్రీమియర్స్, డే 1 కలెక్షన్స్‌తో కలిపి ది రాజా సాబ్ మూవీ వరల్డ్ వైడ్‌గా 60 కోట్ల రూపాయలు రాబడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











