The RajaSaab Day 1 Box Office: ది రాజాసాబ్ ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లు? కల్కిని ప్రభాస్ బీట్ చేస్తాడా?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది.
ది రాజా సాబ్ చిత్రాన్ని సుమారుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ మూవీ ప్రమోషన్స్ భారీగా స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి. ప్రభాస్ చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ వస్తూ కొత్తగా కనిపించారు. దాంతో ఈ సినిమా ఆయన అభిమానులకు ప్రత్యేకంగా మారింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉంది? ఈ చిత్రం తొలి రోజు ఏ మేరకు కలెక్షన్లను సాధించే అవకాశం ఉందనే అంచనా వివరాల్లోకి వెళితే..

ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ది రాజా సాబ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోను, ఇతర రాష్ట్రాల్లో భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ కట్టడం జరిగింది. ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ సుమారుగా 250కుపైగా కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ది రాజాసాబ్ సినిమాకు సంబంధించి వరల్డ్ వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమై ఊపందుకొంటున్నది. ఓవర్సీస్‌లో దాదాపు నెల రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టారు. ఇక ఇండియాలోను ప్రీ సేల్స్ భారీగా స్పందన లభిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కావాల్సి ఉంది. సంక్రాంతి రేసులో ఈ సినిమాకు ఇతర అగ్రహీరోలు సినిమాలు చిరంజీవి, విజయ్, శివకార్తీకేయన్ భారీ పోటీ ఎదురవుతున్నది.
ఇలాంటి భారీ పోటీల మధ్య ది రాజాసాబ్ చిత్రం భారీగానే వసూళ్లను నమోదు చేస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో 65 నుంచి 70 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ప్రీమియర్ల తర్వాత పాజిటివ్ టాక్ ఉంటే.. ఈ చిత్రం కరెంట్ బుకింగ్ భారీగా, రికార్డుస్థాయిలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక నార్త్ అమెరికా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. కాబట్టి ఇంకా భారీగా అడ్వాన్స్ బుకింగ్, కరెంట్ బుకింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన అమెరికా, కెనడాలో కలిపి సుమారుగా 450 లోకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 1250 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రీమియర్లకు సంబంధించి 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 650K డాలర్లు వసూలు అయ్యాయి. ప్రీమియర్లు, తొలి రోజు కలిపి 9 కోట్లకుపైగానే కలెక్షన్లను రాబట్టింది.
వరల్డ్ వైడ్‌గా ది రాజాసాబ్ రికార్డు వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా 90 నుంచి 100 నుంచి 120 కోట్ల మేర కలెక్షన్లు సాధించడానికి అవకాశం ఉంది. పాజిటివ్ టాక్ ఉంటే.. ఇంకా ఈ రేంజ్ పెరిగే ఛాన్స్ ఉంది అని చెబుతున్నారు. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇండియాలో కల్కి 2898AD చిత్రం తొలి రోజు 114 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











