The RajaSaab Day 1 Collections: ది రాజా సాబ్ ఫస్ట్ డే కలెక్షన్లు... ప్రభాస్ మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?

The RajaSaab Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ బడ్జెట్ మూవీ ' ది రాజా సాబ్ (The Raja Saab)పై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యంగ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్-ఫాంటసీ-కామెడీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా నిర్మించారు. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, జనవరి 8న ప్రీమియర్ షోలతోనే బాక్సాఫీస్ రేస్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వర్డల్ వైల్డ్ గా రాజా సాబ్‌ మూవీకి ఓపెనింగ్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయి? ఈ వివరాల్లోకి వెళితే...

రాజాసాబ్‌లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా కనిపించారు. బొమన్ ఇరానీ, జరీనా వాహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీని కార్తీక్ పళని, ఎడిటింగ్‌ను కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహించగా, సంగీతాన్ని తమన్ అందించారు.

The Rajasaab Day 1 Expected Box Office Collections Worldwide

బడ్జెట్, బ్రేక్ ఈవెన్ లెక్కలు ఇలా..
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 'ది రాజాసాబ్' బడ్జెట్ సుమారు రూ.400 కోట్లు గా అంచనా. థియేట్రికల్ బిజినెస్ పరంగా ఆంధ్రా-నైజాం రూ.120 కోట్లు, హిందీ రూ.30 కోట్లు, తమిళం రూ.8 కోట్లు, కర్ణాటక రూ.15 కోట్లు, కేరళ రూ.4 కోట్లు మేర డీల్స్ జరిగాయి. ఓవర్సీస్ హక్కులు సుమారు రూ.80 కోట్లకు విక్రయమయ్యాయి. మొత్తంగా సినిమా ఓవరాల్ బిజినెస్ విలువ రూ.250 కోట్లకు పైగాగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన థియేటర్లలో లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ వర్గాల అంచనా.

ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ క్లబ్
ఓవర్సీస్‌లో సినిమాను ప్రతంగిరా మూవీస్ విడుదల చేసింది. లాభాల్లోకి రావాలంటే ఓవర్సీస్ మొత్తం 10 మిలియన్ డాలర్లు (90 కోట్ల రూపాయలు), నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్‌ కావాలంటే 7.5 మిలియన్ డాలర్లు (68 కోట్ల రూపాయలు) వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు తెలిపారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 'ది రాజాసాబ్' ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ఇలా ప్రీ సేల్స్‌లోనే ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకోవడం ప్రభాస్‌కు ఇది మూడోసారి. గతంలో కల్కి 2898 ఏడీ, సలార్ పార్ట్ 1 కూడా విడుదలకు ముందే ఓవర్సీస్‌లో మిలియన్ మార్క్ క్రాస్ చేశాయి.

ది రాజాసాబ్‌ ఓపెనింగ్ కలెక్షన్స్
ది రాజాసాబ్ మూవీ ప్రీమియర్ షోలతో భారీ ఓపెనింగ్ నమోదు చేసింది. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ బీఫిల్మీ ఆఫీసియల్ (BFilmy Official) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముంది. ప్రీమియర్ షోల నుంచే కలెక్షన్లు సాలిడ్ గా ఉన్నాయి. ప్రీమియర్స్ ద్వారా రూ.11.55 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక తొలి రోజు (డే-1)ఇండియాలో రూ.36.40 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో 2.45 మిలియన్ డాలర్లు (సుమారు రూ.22.08 కోట్లు) వసూలు చేయనున్నట్టు అంచనా వేసింది. ఇక మొత్తంగా వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.70 కోట్లు దాటే అవకాశముందట. ముఖ్యంగా తెలంగాణలో బుకింగ్స్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఈ స్థాయి నంబర్లు రావడం విశేషంగా చెప్పుకోవాలి.

అలాగే.. ఓవర్సీస్‌లో ముఖ్యంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియాల్లో బుకింగ్స్ జోరుగా సాగాయి. సంక్రాంతి సీజన్‌లో సోలో రిలీజ్‌గా రావడం సినిమాకు అడ్వాంటేజ్‌గా మారింది. అయితే, పబ్లిక్ టాక్ విషయానికి వస్తే మిక్స్డ్ రివ్యూలే వినిపిస్తున్నాయి. అదే కారణంగా తొలి రోజు అంచనాలు కొంత తగ్గినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా వస్తే ఓపెనింగ్ డే వరల్డ్‌వైడ్ రూ.100-120 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని ముందుగా అంచనా వేశారు. కానీ ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వల్ల ఆ టార్గెట్ కొంత దూరంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X